పేరు మార్చుకో.. కోహ్లీకి వీరూ సూచన Sehwag adviced Kohli to change his name to Badal

Sehwag adviced kohli to change his name to badal

India vs England, Ind vs Eng, Virendra Sehwag, Virat Kohli, Twitter, badal, name change, Cricket

Sehwag who is known for his trolling skills, took to Twitter and wrote, "Kohli ko paper me name change Ad daalna chahiye. He should call himself Badal"

పేరు మార్చుకో.. కోహ్లీకి వీరూ సూచన

Posted: 12/16/2016 06:09 PM IST
Sehwag adviced kohli to change his name to badal

టీమిండియా క్రికెట్ జట్టుపై ఎవరైనా ఏమైనా అనుచిత వ్యాఖ్యలు చేయాలని చూస్తే ముందుగా ఆయన ఎక్కడున్నారని చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయన ధాటికి తట్టుకుని నిలబడే సత్తా మాత్రం ఎవరికీ లేదు. ఒకనాటి టీమిండియా వీరోచిత ఓపెనర్, తన సెకండ్ ఇన్నింగ్ తో ఇటు టీమిండియా జట్టుకు రక్షణ కవచంలా నిలుస్తున్నాడు. అలాగే టీమిండియా విజయాలను, ఆటగాళ్ల ప్రదర్శనను ప్రశంసిస్తూ మంచి కామెంట్లు చేస్తుంటాడు.

ట్విట్టర్‌ వేదికగా వీరూ తన సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌కు పని చెబుతుంటాడు. సెహ్వాగ్‌ మనసు ఈసారి భారత టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వైపు మళ్లింది. విరాట్‌ వెంటనే తన పేరును మార్చుకోవాలని సూచించాడు. ఏం పేరు పెట్టుకోవాలో కూడా ట్వీట్‌ చేశాడు. వీరూ ఇలా కామెంట్‌ చేయడానికి కారణమేంటంటే.. ఈ ఏడాది కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంగతి క్రికెట్‌ అభిమానులకు తెలిసిందే.

బ్యాట్స్‌మన్‌గా, టెస్టు కెప్టెన్‌గా రికార్డులు తిరగరాస్తున్నాడు. అన్ని ఫార్మాట్లలో పరుగుల సగటు దాదాపు 90 శాతం ఉంది. కోహ్లీ ప్రదర్శన వీరూకు కూడా తెగనచ్చేసింది. విరాట్‌ను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు. కోహ్లీ బ్యాటింగ్‌ అద్భుతంగా ఉందని, అతను మెరుపులాంటివాడని కితాబిచ్చాడు. విరాట్‌ వెంటనే తన పేరును మెరుపుగా మార్చుకోవాలని సూచించాడు. వీరూ సూచనకు విరాట్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virendra Sehwag  Virat Kohli  Twitter  badal  name change  Cricket  

Other Articles