క్రికెట్ కు తమ దేశమే పుట్టినిల్లుగా చెప్పుకుని ప్రచారానికి తెరతీసిన ఇంగ్లాండ్ జట్టు.. భారత్ లో సుదీర్ఘ పర్యటనకు వచ్చి పరాభవం పాలైంది. మరో టెస్టు మ్యాచ్ మిగిలివుండగానే అతిధ్య జట్టు ధాటికి తట్టుకోలేక సిరీస్ ను చేతికి అందించిన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో పరాభవం పాలైనట్టుగా భావించిన పర్యాటక ఇంగ్లాండ్ జట్టు చివరిదైన ఐదవ టెస్టులోనైనా కనీసం గెలుపు తీరాలకు చేరాలని శ్రమిస్తుంది.
ఇందులో భాగంగా చెన్నై వేదికగా ఇవాళ ప్రారంభమైన టెస్టులో నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. తొలి రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 284 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ మరోసారి బ్యాటింగ్ తీసుకుంది. ఇంగ్లండ్ ఓపెనర్లు జెన్నింగ్స్ (1), అలెస్టర్ కుక్(10)ఆదిలోనే నిష్క్రమించగా, జో రూట్(88), బెయిర్ స్టో(49)లు రాణించారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 146 పరుగులు జోడించిన తరువాత రూట్ అవుటయ్యాడు.
ఆ తరువాత మొయిన్ అలీతో కలిసి స్టో ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఈ జోడి 86 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన తరువాత స్టో అవుటయ్యాడు. ఆపై మొయిన్ అలీ శతకం నమోదు చేసి జట్టును మరింత పటిష్ట స్థితికి చేర్చాడు. మొయిన్ అలీ పరుగుల ఖాతా తెరవకుండానే ఔట్ అయ్యే ప్రమాదంలో చిక్కుకుని తప్పించుకున్నాడు. తన బ్యాటు నుంచి వెళ్లిన క్యాచ్ ను పట్టుకోవడంలో టీమిండియా అటగాడు కెఎల్ రాహుల్ కొంత నిర్లక్ష్యం వహించడంతో అలీ ఆటకు ప్రాణాలు వచ్చి శతకాన్ని నమోదు చేసుకున్నారు.
ఇక మరో పర్యాయం రవీంద్ర జడేజా విసిరిన బంతికి ఆయన డీఆర్ఎస్ అపీలు చేసినా.. అది ఎల్బీడబ్యూ కాదని థర్ ఎంఫైర్ నిర్ణయిస్తూ.. ఫీల్డ్ ఎంపైర్ ఇచ్చిన తీర్పుతో సమ్మతాన్ని తెలపడంతో ఇక విజృంభించిన అలీ శతకాన్ని నమోదు చేసి ఇంగ్లాండ్ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి అలీ(120 బ్యాటింగ్), స్టోక్స్(5 బ్యాటింగ్)లు క్రీజ్‌లో ఉన్నారు.భారత బౌలర్లలో జడేజా మూడు వికెట్లు సాధించగా, ఇషాంత్ శర్మకు వికెట్ లభించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more