చివరి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ విజయం India seal 4-0 win over England as Jadeja takes 7/48

India seal 4 0 win over england as jadeja takes 7 48

Team India, India vs England, virat kohli, alastair cook, joe root, moen ali, ravindra jadeja, ravichandran ashwin, Anurag Thakur, karun nair, rahul dravid, BCCI, sports, sports news, cricket news, cricket

India pulled the curtains down on England’s winter of discontent in the manner befitting their dominance as the hosts clinched the five-match series 4-0 with an innings and 75-run victory in the fifth and final cricket Test

చివరి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ విజయం

Posted: 12/20/2016 07:03 PM IST
India seal 4 0 win over england as jadeja takes 7 48

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా పర్యాటక జట్టు ఇంగ్లండ్ తో జరిగిన చివరిదైన ఐదవ టెస్టులో భారత్ ను విజయం వరించింది. ఇన్నింగ్స్ 75 పరుగులతో విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ ప్రారంభమైన నాటి నుంచి ఇన్నింగ్స్ విజయంపై కన్నేసిన టీమిండియా.. ఒక మ్యాచ్ మిగిలుండగానే ఇంగ్లాండ్ నుంచి సీరీస్ ను కైవసం చేసుకుంది. ఇక చివరి టెస్టులో ఆఖరి రోజు ఆట అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన టీమిండియా పర్యాటకులపై ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసుకుని సత్తాచాటింది. 2012లో ఇంగ్లాండ్ లో జరిగిన టెస్టుకు ప్రతికారం తీర్చుకుంది.

లంచ్ సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా పర్యాటక జట్టు పటిష్టస్థితిలోవుండటంతో ఈ మ్యాచ్ డ్రా అవుతుందని అంతా భావించారు. రెండో సెషన్లో జెడేజా తన బంతికి పదును పెట్టాడు. ఏకంగా టాప్ ఆర్డర్ ను కుప్పకూల్చాడు. దీంతో రెండో సెషన్ లో నాలుగు వికెట్లు సాధించి ఆధిక్యంలో నిలిచిన విరాట్ సేన.. మూడో సెషన్లో ఇంగ్లండ్ భరతం పట్టింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా విజృంభించి ఏడు వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా, మిగతా పనిని ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్లు పూర్తి చేశారు. తద్వారా సిరీస్ను భారత్ 4-0 గెలుచుకుని ఇంగ్లండ్ కు నిరాశను మిగిల్చింది.
 
12/0 ఓవర్ నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఆట ఆరంభించిన ఇంగ్లండ్ కు మంచి ఆరంభమే లభించింది. కెప్టెన్ అలెస్టర్ కుక్(49), జెన్నింగ్స్(54)లు బాధ్యతాయుతంగా ఆడారు. ప్రధానంగా ఈ ఇద్దరూ తొలి సెషన్లో వికెట్ ఇవ్వకుండా భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. తొలి వికెట్ కు 103 పరుగులు జోడించి సమయోచిత ఆట తీరు ప్రదర్శించారు. ఈ క్రమంలో కుక్ ను తొలి వికెట్ గా పెవిలియన్ కు పంపిన జడేజా.. ఆపై స్వల్ప వ్యవధిలో జెన్నింగ్స్ ను అవుట్ చేశాడు. దాంతో ఇంగ్లండ్ 110 పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది.

ఆ తరువాత 19 పరుగుల వ్యవధిలో రూట్ ను జడేజా అవుట్ చేయగా, బెయిర్ స్టోలను ఇషాంత్ శర్మ అవుట్ చేయడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మొయిన్ అలీ(44), బెన్ స్టోక్స్(23)లు పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేశారు. ఈ జోడి 63 పరుగులను జోడించడంతో ఇంగ్లండ్ తిరిగి గాడిలో పడినట్లు కనబడింది.కాగా, 192 పరుగుల వద్ద అలీని జడేజా ఐదో వికెట్ గా అవుట్ చేయడంతో ఇక ఇంగ్లండ్ తేరుకోలేదు. పరుగు వ్యవధిలో స్టోక్స్ ను జడేజా అవుట్ చేసి ఇంగ్లండ్ వెన్నువిరిచాడు.

ఆ తరువాత డాసన్(0)ను అమిత్ మిశ్రా అవుట్ చేయగా,  రషిద్(2)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్ కు పంపాడు. అయితే జాస్ బట్లర్-స్టువర్ట్ బ్రాడ్లు కాసేపు భారత్ బౌలింగ్ ను ప్రతిఘటించినా ఫలితం దక్కలేదు. తొలుత ఈ జోడిలో బ్రాడ్ ను జడేజా అవుట్ చేయగా, ఆ తరువాత వెంటనే బాల్ కూడా జడేజా బౌలింగ్ లో అవుటయ్యాడు. దాంతో భారత్ ఖాతాలో అపూర్వమైన విజయం చేరింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కరుణ్ నాయర్ కు దక్కగా, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు విరాట్ కోహ్లికి లభించింది. ఇది భారత్ కు వరుసగా 18 వ టెస్టు విజయం కావడం మరొక విశేషం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  India vs England  virat kohli  alastair cook  ravindra jadeja  cricket  

Other Articles