స్టీవ్ స్మిత్ నోట కరుణ్ నాయర్ మాట..! warner should score just like karun nair says steve smith

Warner should score just like karun nair says steve smith

Steven Smith, one day, three thousand runs, australia, pakistan, aussies captain record, sports news, cricket

Steve Smith reached 3,000 one-day international runs in record time with yet another century to guide Australia to a seven-wicket victory

స్టీవ్ స్మిత్ నోట కరుణ్ నాయర్ మాట..!

Posted: 01/24/2017 07:38 PM IST
Warner should score just like karun nair says steve smith

వచ్చే నెల్లో భారత్తో జరిగే నాలుగు టెస్టుల సిరీస్లో తమ ఆటగాళ్లు మరింత ఎక్కువ బాధ్యతను తీసుకుని ఆడితేనే గెలుపు సాధ్యమని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ స్సష్టం చేశాడు. కఠినమైన భారత పర్యటనకు వస్తున్నందున సీనియర్ ఆటగాళ్లు ఇన్నింగ్స్ లను నిలబెట్టే యత్నం చేయాలని స్మిత్ సూచించాడు. ప్రత్యేకంగా ఈ సిరీస్లో డేవిడ్ వార్నర్ భారీ స్కోర్లు సాధిస్తాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన ఐదో టెస్టులో భారత ఆటగాడు కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీని వార్నర్ ఆదర్శంగా తీసుకుని చెలరేగిపోవాలన్నాడు.

భారత్ తో సిరీస్ లో మా ఆటగాళ్లు పరిస్థితులకు తొలుత అలవాటు పడాలి. ప్రధానంగా సీనియర్ ఆటగాళ్లు పరిస్థితులన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారని అనుకుంటున్నా. ఇటీవల శ్రీలంక పర్యటనలో మేము సరైన ప్రదర్శన చేయలేకపోయాం. ప్రస్తుతం భారత్ పర్యటనలో నాతో పాటు డేవిడ్ వార్నర్, స్టార్క్, హజల్ వుడ్, నాథన్ లయన్ల ఎక్కువ బాధ్యత ఉంది. సొంత మైదానాల్లో భారత్ ను ఎదుర్కోవడం అంత సులువు కాదు. దాంతో పాటు భారత్ అద్భుతమైన విజయాలతో దూకుడుగా ఉంది. ప్రతీ ఒక్కరూ వారి వారి ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేస్తేనే భారత్ పై విజయం సాధ్యమవుతుంది. భారత్ పై గెలవాలంటే వ్యక్తిగత డబుల్ సెంచరీలు కానీ, ట్రిపుల్ సెంచరీలు కానీ ఉండాలి. ఇటీవల నాయర్ చేసిన విధంగా సెంచరీల్ని డబుల్గా కానీ, ట్రిపుల్గా మార్చండి. ఆ ఆటగాడ్ని ఆదర్శంగా తీసుకోండి'అని స్మిత్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles