సునీల్ జోషీతో బంగ్లా క్రికెట్ బోర్డు చర్చలు Anil Kumble advises BCB to hire Sunil Joshi as spin consultant

Anil kumble advises bangladesh cricket board to hire sunil joshi as spin consultant

india vs bangaladesh, ind vs ban, india vs bangladesh test series, bangladesh vs india, spinner, bangladesh, india, anil kumble, team india, spin consultant, sunil joshi, cricket news, sports news

Former India left-arm spinner Sunil Joshi has been approached by the Bangladesh Cricket Board (BCB) to take up the role of their spin consultant

సునీల్ జోషీతో బంగ్లా క్రికెట్ బోర్డు చర్చలు

Posted: 02/11/2017 04:20 PM IST
Anil kumble advises bangladesh cricket board to hire sunil joshi as spin consultant

భారత పర్యలనకు వచ్చిన బంగ్లాదేశ్.. భారత లెఫ్ట్ అర్మ్ స్పిన్నర్ సునీల్ జోషితో తమ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్ గా నియమించుకునే విషయమై చర్చలు సాగిస్తుంది. అన్ని అనుకూలంగా జరిగితే.. భారత్ తరపున 15 టెస్టు మ్యాచ్లు, 69 వన్డేలకు ప్రాతినిథ్యం వహించిన సునీల్ జోషి బంగ్లాదేశ్ స్పిన్ కన్సల్టెంట్ గా వ్యవహరించనున్నారు.  అయితే సునీల్ జోషి పేరును ప్రతిపాదించింది మాత్రం ఎవరో తెలుసా..? భారత్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనీల్ కుంబ్లే. ఒక స్పిన్ దిగ్గజంగా వెలుగొందిన కుంబ్లే.. మరో స్పిన్నర్ పేరును ప్రస్తావించి అతడ్ని సంప్రదించాల్సిందిగా కోరడం కూడా ముదావహం.

భారత్ తో టెస్టు మ్యాచ్లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన బంగ్లాదేశ్.. మన ప్రధాన క్రికెట్ కోచ్ అనిల్ కుంబ్లే ను తమ దేశ క్రికట్ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్ గా వ్యవహరించడానికి ఎవరైనా భారత మాజీ స్పిన్నర్ పేరును ప్రతిపాదించాలని అనీల్ కుంబ్లేను అశ్రయించింది. అయితే ఏమాత్రం అలోచించకుండా కుంబ్లే  భారత మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ సునీల్ జోషి పేరును ప్రతిపాదించారట. అతడ్ని కలవాలంటూ బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) అధికారులకు సలహా ఇచ్చాడు. ఒక నాణ్యమైన స్పిన్ కోచ్ కోసం కుంబ్లేను కలిస్తే  అతను జోషి పేరును సూచించినట్లు బీసీబీ అధికారి అక్రమ్ ఖాన్ తెలిపాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఉన్న జోషితో చర్చలు జరుగుతున్నట్లు అక్రమ్ పేర్కొన్నాడు.

ఇదిలా వుంచితే, ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా బంగ్లాదేశ్ తొలిసారి భారత్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2000లో బంగ్లాదేశ్ లో మొదటిసారి పర్యటించిన భారత జట్టులో జోషి సభ్యుడు కావడం ఇక్కడ ఒక విశేషమైతే, ఆ మ్యాచ్లో అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కడం మరో విశేషం. భారత్ తరపున 15 టెస్టు మ్యాచ్లు, 69 వన్డేలకు జోషి ప్రాతినిథ్యం వహించాడు. టెస్టుల్లో 41 వికెట్లు తీయగా,వన్డేల్లో  69 వికెట్లు తీశాడు. కాగా, దేశవాళీ క్రికెట్ లో భాగంగా 160 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడిన జోషి 615 వికెట్లు సాధించి దిగ్గజ బౌలర్గా గుర్తింపు పొందాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spinner  bangladesh  india  anil kumble  team india  spin consultant  sunil joshi  cricket  

Other Articles