సందర్భాన్ని బట్టి తనదైనశైలితో ట్వీట్ చేస్తూ అందరి మన్ననలు పొందే భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. తను చేసిన ట్విట్పై నెట్ జనుల విమర్శలకు స్పందించాడు. అంధుల టీ20 వరల్డ్ కప్ విజేతలను అభినందిస్తూ.. సెహ్వాగ్ చేసిన ట్వీట్ పై వచ్చిన విమర్శలకు ఆయన సమాధానం చెప్పారు. వారి టీ20కి అదే తరహాలో ప్రచారం సాగిందని, అందుకనే తాను అలా ట్విట్ చేశానని వీరూ చెబుతున్నారు. ఇక మరికోందరు అదేపనిగా అయనను విమర్శించడంతో.. వారికి పరిశోధన చేయాలని చెప్పారు.
మొన్నీమధ్య జరిగిన అంధుల టీ-ట్వంటీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని సెహ్వాగ్ ట్విట్టర్ ద్వారా ప్రస్తావిస్తూ ‘‘అంధుల టీ20 ప్రపంచకప్ గెలిచిన మరో నీలి రంగు జట్టుకు అభినందనలు. వాళ్లు వంద కోట్లమందికి చిరునవ్వులు పంచారు’’ అని ట్వీట్ చేశాడు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి ఈ ట్వీట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన అజయ్ వీరూ తమను అభినందించడం సంతోషమేనని, కాకపోతే మరో నీలి రంగు జట్టు అని పేర్కొనడమేంటని ప్రశ్నించాడు. తాము కూడా దేశం కోసమే ఆడుతున్నామని, దేశం కోసమే సీరియస్‌గా ఆడతామని అజయ్ స్పష్టం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more