డబ్బే డబ్బు.. నోట మాట రావడం లేదు Ben Stokes woke up at 3.30am to follow Indian Premier League ...

Ben stokes looking forward to play alongside ms dhoni

england,rising pune supergiants,benjamin andrew stokes,mahendra singh dhoni,steven peter devereux smith,indian premier league 2017 ndtv sports, cricket

Ben Stokes was bought by Rising Pune Supergiants for a whopping amount of Rs. 14.5 crore during the IPL player auction

డబ్బే డబ్బు.. నోట మాట రావడం లేదు

Posted: 02/21/2017 09:32 PM IST
Ben stokes looking forward to play alongside ms dhoni

ఐపీఎల్ వేలంపై ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అమితాసక్తి కనబరిచాడు. బెంగళూరులో జరిగిన వేలంను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తెల్లవారుజామునే మేల్కొన్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. వేలంలో తనకు అత్యధిక ధర పలకడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. తన జీవితాన్నే మార్చేసే ధర దక్కిందని వ్యాఖ్యానించాడు.

‘ వేలంపాటను ప్రత్యక్షంగా చూడాలని అలారం పెట్టుకుని తెల్లజామున 3.30 గంటలకు నిద్రలేచాను. వేలంలో నా వంతు వచ్చే వరకు నలభై నిమిషాలు వేచి చూశాను. అలా ఉత్సాహంగా ఎదురు చూశాను. నిజానికి ఏం జరుగుతుందో నాకు తెలియదు. అయితే టీవీలో ప్రత్యక్ష ప్రసారం చూడలేదు. ట్విటర్ ను ఫాలో అయ్యాను. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ట్విటర్ లో రీప్రెష్ కొడుతూనే ఉన్నాను. నెటిజన్లు పెట్టిన ట్వీట్లు చూసి పుణే నన్ను దక్కించుకుందని తెలుసుకున్నాను. ఇది నా జీవితాన్ని మార్చేసేంత పెద్ద ధర. నాకు మాటలు రావడం లేదు. గత కొద్ది రోజులుగా నా జీవితంలో అన్ని మంచి విషయాలు వింటున్నాను. ముఖ్యంగా ఈ వారం నాకు బాగా కలిసొచ్చింద’ని స్టోక్స్‌ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : england  rising pune supergiants  benjamin andrew stokes  mahendra singh dhoni  

Other Articles