ప్రత్యర్ధుల గురించి అందోళన అవసరం లేదు: కోహ్లీ We're Not Bothered About The Opposition, Says Kohli...

Virat kohli grateful to anil kumble for helping him evolve as a cricketer

india a vs australia, india a vs australia warm-up game, india a vs australia pune match, ind a vs aus 2017, australia, india vs australia test 2017, virat kohli, ashwin, jadeja, steve smith, cricket news, cricket

“We’re not bothered about the opposition, we sure are aware of their skills, positives and negatives but try to focus on our game and plans rather than mulling over them,” said Kohli.

ప్రత్యర్ధుల గురించి అందోళన అవసరం లేదు: కోహ్లీ

Posted: 02/22/2017 07:43 PM IST
Virat kohli grateful to anil kumble for helping him evolve as a cricketer

టీమిండియాతో టెస్టు సిరీస్ లో తలపడేందుకు సిద్దమైన పర్యాటక జట్టు ఆస్ట్రేలియా విషయమై స్పందిస్తూ.. తమ జట్టు జైత్రయాత్ర కోనసాగుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. తమ జట్టు ప్రసుత్తం అత్యుత్తమంగా రాణించడంపై హర్షం వ్యక్తం చేశాడు. తమ జట్టు ఎంతో పటిష్టంగా వుందని, ప్రత్యర్థి అస్ట్రేలియా జట్టు గురించి తాము అందోళన చెందడం లేదని తెలిపాడు. జట్టుతో పాటు పాటు ఆటగాడిగానూ, కెప్టెన్ గానూ మెరుగవుతున్నాను. ఆసీస్ జట్టులో కొందరు మాత్రమే ఫామ్ లో ఉన్నారు. తనకు ఇరవై రెండు ఏళ్లున్ననప్పుడు ముఫ్పై ఐదేళ్ల వ్యక్తులతో పోల్చి చూశారు. క్రమక్రమంగా తాను ఆ దశకు చేరుకుంటున్నానని అన్నాడు. క్రికెట్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాను' అని వివరించాడు.
 
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య రేపటి నుంచి పుణేలో తొలి టెస్టు ప్రారంభం కానుంది. టీమిండియా ఆటగాళ్లు పుణేలో ప్రాక్టీస్ సెషన్లో చెమటోడుస్తున్నారు. కెప్టెన్ కోహ్లీ సహా ప్రధాన ఆటగాళ్లు నెట్ సెషన్లకే పరిమితమయ్యారు. రవీంద్ర జడేజా, అశ్విన్ బౌలింగ్ లో బ్యాట్స్ మెన్ ప్రాక్టీస్ చేస్తున్నారు.  రెండు టెస్టులకు గానూ ఎలాంటి మార్పు లేకుండా చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ భారత జట్టును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు పుణేలో తొలి టెస్ట్, మార్చి నాలుగు నుంచి ఎనమిది వరకు బెంగళూరులో రెండో టెస్టు జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs australia  team india  Australia  Virat kohli  Steven Smith  Mumbai  cricket  sports news  cricket  

Other Articles