అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల మోత మోగిస్తూ ఇప్పటికే అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్న భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆసీస్ దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో నంబర్ వన్ క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లినేనని కొనియాడాడు. దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ కంటే కోహ్లినే అత్యుత్తమ క్రికెటర్ అని ప్రశంసించాడు. ఇటీవల కాలంలో విరాట్ నమోదు చేసిన అత్యుత్తమ గణాంకాలే అతన్ని అగ్రస్థానంలో నిలిపాయన్నాడు.
'విరాట్ కోహ్లి వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు. వరుస విరామాల్లో సెంచరీలు చేస్తూ విరాట్ దూసుకుపోతున్నాడు. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వీవ్ రిచర్డ్స్, భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లతో పోల్చదగిన ఒకే ఒక్క క్రికెటర్ కోహ్లి. నేను విరాట్ కు పెద్ద అభిమాన్ని. అతని బ్యాటింగ్ చూడటం నాకు చాలా ఇష్టం. కెప్టెన్ గా విరాట్ కోహ్లి దూకుడును కూడా ఇష్టపడతా. ఒక క్రికెటర్‌గా విరాట్ అంటే నాకు అభిమానం. అతనొక భిన్నమైన ఆటగాడు'అని వార్న్ తెలిపాడు. ఈ సిరీస్‌లో భారత క్రికెట్ జట్టే ఫేవరెట్ అని వార్నర్ జోస్యం చెప్పాడు. భారత్ ను స్వదేశంలో ఓడించడం ఆసీస్ కు అంత సులువు కాదన్నాడు.ఇది కచ్చితంగా స్టీవ్ స్మిత్ సేనకు పరీక్ష అని వార్న్అభిప్రాయపడ్డాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more