భారత్ తో రెండో టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ డీఆర్ఎస్ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎటువంటి చర్యలు తీసుకోలేకపోవడంపై దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు డు ప్లెసిస్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ వివాదం చాలా పెద్దదైనప్పటికీ దాన్ని ఐసీసీ చాలా తేలిగ్గా తీసుకోవడాన్ని డుప్లెసిస్ తప్పుబట్టాడు. అసలు మొత్తం విషయాన్ని పక్కకు పెట్టిన ఐసీసీ.. ఆ రగడపై కనీస చర్యలు ఎందుకు చేపట్టలేదో తనకు అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశాడు.
'ఇటీవల మా జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు నేను బాల్ టాంపరింగ్ చేశానని ఆ జట్టు తీవ్రంగా ఆరోపించింది. నోటిలో ఉన్న మింట్ ను తీసి రుద్దానంటూ అనవసర రాద్దాంతం చేసింది. దానిపై ఐసీసీ కూడా తీవ్రంగా స్పందించింది. నేను ఏ తప్పు చేయలేదని విన్నవించుకున్నా చివరికు జరిమానా విధించారు. అప్పుడు నా పట్ల ఐసీసీ కఠినంగా ప్రవర్తించింది. మరి ఇప్పుడు ఇంత పెద్ద విషయాన్ని ఎలా పక్కకు పెట్టేసింది. ఆ వివాదంపై ఏ ఆటగాడిపై చర్యలు కనీస చర్యలు తీసుకోలేదు. ఇది నన్ను తీవ్రంగా ఆశ్చర్యపరిచిన విషయమే కాదు.. చాలా సీరియస్ గా ఆలోచింపజేసిన అంశం'అని డు ప్లెసిస్ పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more