OPPO releases new Team India jersey టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసిన బిసిసిఐ, అప్పో

Oppo releases new team india jersey

bcci, Board of Control for Cricket in India, icc, cricket, icc champions_trophy_2017, india_cricket_team, india cricket team, oppo, new jersey, cricket

Indian Cricket team’s new clothing sponsor Oppo have unveiled the new Jersey for the upcoming Champions Trophy to be held in England, in June.

టీమిండియా కొత్త జెర్సీని విడుదల చేసిన బిసిసిఐ, అప్పో

Posted: 05/04/2017 07:22 PM IST
Oppo releases new team india jersey

టీమిండియా ఆటగాళ్లకు కొత్త జెర్సీ అందుబాటులోకి వచ్చింది. ముంబైలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో టీమిండియా క్రికెటర్లు ధరించే కొత్త జెర్సీని ఆవిష్కరించారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సీఈవో రాహుల్ జోహ్రి, టీమిండియాకు అధికార స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ఒప్పో మొబైల్స్ ఇండియా అధ్యక్షుడు స్కైలి నూతన జెర్సీని విడుదల చేశారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ ఒప్పోతో బీసీసీఐ ఐదు సంవత్సరాలు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

త్వరలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ ఇంకా టీమ్ ను ప్రకటించలేదు. రెవెన్యూ పంపకం విషయంలో ఐసీసీతో తలెత్తిన వివాదం నేపథ్యంలో బీసీసీఐ ఆగ్రహంతో ఉంది. ఒకవేళ ఈ టోర్నీలో టీమిండియా పాల్గొంటే... ఈ కొత్త జెర్సీని మన ఆటగాళ్లు ధరిస్తారు. కాగా, 1,079 కోట్లతో ఒప్పో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా ఇటీవల జెర్సీ హక్కుల కోసం నిర్వహించిన వేలం స్టార్ ఇండియాను ఒప్పో  అధిగమించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bcci  India  icc  champions trophy  new jersy  oppo  cricket  

Other Articles