భారతదేశంలో క్రికెట్ కు అభిమానులు ఎంతలా వున్నారంటే.. ఆ స్థాయిలో మరే అంశమూ పోటీపడలేనంతగా వున్నారు. క్రికెట్ కు మాత్రమే కాదు క్రికెటర్లకు కూడా అభిమానులు అదేస్థాయిలో వున్నారు. మరోలా చెప్పాలంటే క్రికెటర్లను అభిమానులు ఆరాధిస్తారు. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ను క్రికెట్ దేవుడిగా చేసిన అభిమానులు.. ఆయను ఆరాధస్తున్న సంఘటనలు అనేకం. తాజాగా జరిగిన ఓ పరిణామం భారత్ లో క్రికెటర్లపై ఎంత అభిమానం వుంటుందో రుజువు చేస్తుంది.
మైదానంలో ఆడుతుండగానే భద్రతా సిబ్బందిని దాటుకొని తమ అభిమాన ఆటగాడిని కలిసేందుకూ వెనకాడరు. మైదానంలో క్రికెట్ దిగ్గజాలు సచిన్, గంగూలీ కాళ్లకు అభిమానులు దండం పెట్టిన సంఘటనలు గతంలో చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిలో బుధవారం కాన్పూర్ వేదికగా గుజరాత్ లయన్స్, దిల్లీ డేర్‌డెవిల్స్ మ్యాచ్‌లోనూ ఇలాంటి దృశ్యమే కనిపించింది.
స్థానిక ఆటగాడు, గుజరాత్ సారథి రైనాను కలిసేందుకు రింకూ అనే అభిమాని భద్రతా వలయాన్ని దాటుకొని మైదానంలోకి దూసుకొచ్చాడు. సిబ్బంది వచ్చేలోపే రైనాతో కరచాలనం చేశాడు. ఆటోగ్రాఫ్ అడిగాడు. ఆ తర్వాత రైనా కోరిక మేరకు వెంటనే మైదానం వీడాడు. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది. రిషబ్‌పంత్ ఔటయ్యేలా అద్భుత ఫీల్డింగ్ చేసిన రైనాను అభినందించేందుకు తాను మైదానంలోకి వెళ్లినట్లు రింకూ చెప్పాడు. గతంలో ఓ రంజీ మ్యాచ్ సందర్భంలో తన అభిమాన క్రికెటర్‌ను కలిశానని పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more