భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఖాతాలోకి మరో అరుదైన ఘనత వచ్చి చేరింది. 2016-17 సంవత్సరానికి గాను ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును దక్కించుకున్నాడు. ఇంగ్లాడ్‌తో జరిగిన అండర్-19 సిరిస్‌లో మంచి ప్రదర్శన కనబర్చిన యువ బ్యాట్స్‌మన్ షుభమన్ గిల్ కు యంగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు దక్కింది.ముంబైలోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించిన సియట్ క్రికెట్ రేటింగ్ ఇంటర్నేషనల్ అవార్డులు-2017 కార్యక్రమంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ చేతల మీదుగా అశ్విన్ ఈ అవార్డు అందుకున్నాడు.
ఈ సందర్భంగా తాను తొలిసారి చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సునీల్ గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న విషయాన్ని అశ్విన్ గుర్తుచేసుకున్నాడు. ఐపీఎల్లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌కు ప్రాతినిధ్యం వహించిన వాషింగ్టన్ సుందర్ గురించి మాట్లాడుతూ... ఐపీఎల్లో అతని ప్రదర్శన ఆకట్టుకుందని తెలిపాడు. విజయ్ హజారే ట్రోఫీలో మంచి ప్రదర్శన చేసినట్లు పలువురు తనతో చెప్పినట్లు వెల్లడించాడు.
45 టెస్టుల్లోనే 250 వికెట్లు తీసిన ఆటగాడిగా కూడా అశ్విన్ రికార్డు సృష్టించాడు. 250పైగా వికెట్లు తీసిన 12వ ఆటగాడు అశ్విన్. ఇప్పటివరకు 49 టెస్టులాడిన అశ్విన్ 92 ఇన్నింగ్స్ ల ద్వారా 275వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యుత్తమంగా 10వికెట్లను ఏడుసార్లు తీయగా, ఐదు వికెట్లను 25సార్లు తీశాడు. వన్డేల్లో 104 ఇన్నింగ్స్ ల ద్వారా 145వికెట్లు సాధించాడు. గత ఒక్క ఏఢాదిలోనే అశ్విన్ అత్యద్భుతంగా రాణించి మొత్తం 99వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more