వెస్టిండీస్ జట్టు ఏక్కడ అడుతున్న మనం ముద్దుగా పిలుచుకునే పేరు విండీస్ అని. అయితే ఇలా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు పిలుచుకునే పేరునే ఇక అధికారికంగా పిలుచుకునేలా చేయాలని భావించింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు యాజమాన్యం. అవునండీ నిజమే. అంతేకాదు వెస్టిండీస్ క్రికెట్ జట్టు పేరును కూడా మర్చేసింది. ఇన్నాళ్లూ వెస్టిండీస్ కు పర్యాయపదంగా రాసుకున్న ‘విండీస’ అనే పేరే ఇప్పుడు అధికారికంగా మారింది.
అలాగే వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా ఇక నుంచి ‘క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ)’గా వ్యవహరించనున్నారు. తమ 91వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మార్పులు జరిగాయి. సరికొత్త మార్పులతో కొత్త అధ్యాయం లిఖిస్తామని బోర్డు సీఈవో జానీ గ్రేవ్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా విండీస్ బోర్డు సంక్షోభంలో ఉన్న విషయం తెలిసిందే. స్టార్ ఆటగాళ్ల రెమ్యునరేషన్ గొడవ జట్టు ఎంపికపై ప్రభావం చూపుతోంది. దీంతో వన్డేల్లో ఆటతీరు నానాటికీ క్షీణించి చివరకు చాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత సాధించలేకపోయింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more