చాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీంగా, పైగా పాక్ పై గ్రాండ్ విక్టరీతో జోరు మీదున్న టీమిండియాకు సడన్ బ్రేక్ పడింది. భారీ స్కోర్ సాధించినప్పటికీ ఛేజింగ్ చేసి మరీ శ్రీలంక షాకిచ్చింది. గురువారం కెన్నింగ్టన్లో జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అవలీలగా ఛేదించింది. 93 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌తో 89 పరుగులు చేసిన కుశాల్ మెండిస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
గుణతిలక 76, మ్యాథ్యూస్ 52 కుశాల్ పెరీర, గుణరత్నె 34 పరుగులు చేసి మరో 8 బంతులు మిగలి ఉండగానే శ్రీలంకను విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్‌కు మాత్రమే ఒక వికెట్ దక్కగా, మిగతా రెండు రనౌట్లు కావడం గమనార్హం. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ధవన్ (128 బంతుల్లో 15 ఫోర్లు, సిక్స్‌తో 125 పరుగులు) సెంచరీతో రెచ్చిపోయాడు.
ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ (79 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78 పరుగులు) మరోమారు సత్తా చాటాడు. చివర్లో ధోని 52 బంతుల్లో 7 పోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేసి స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. చివర్లో కేదార్ జాదవ్ 13బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25 పరుగులు పిండుకోవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లు లసిత్ మలింగకు రెండు, లక్మల్, ప్రదీప్, పెరీరా, గుణరత్నేలకు ఒక్కో వికెట్ దక్కింది. ఇక సెమీస్ కు చేరాలంటే గ్రూప్ బీ లో ఆదివారం సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్ లో భారత్ ఖచ్ఛితంగా గెలిసి తీరాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more