ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ బి జాబితాలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర ఓటమే తమలో గెలవాలన్న కాంక్షను, కసిని పెంచిందని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ఓడిన తరువాత ప్రత్యర్థి జట్ట అంచనాలకు అందని రీతిలో ఏకంగా ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన పాకిస్తాన్.. భారత్ తో ఓటమే తమను విజయాల దిశగా నడిపించిందని అన్నారు. సెమీఫైనల్లో బలమైన ప్రత్యర్థి ఇంగ్లాండ్‌ని మట్టికరిపించి మరీ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ సందర్భంగా పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్పరాజ్ మీడియాతో పలు విషయాలను పంచుకున్నాడు.
లీగ్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోవడం నుంచే తాముపాఠాలు నేర్చుకున్నామన్నారు. భారత్‌తో ఓటమి అనంతరం తమకు మద్దతుగా నిలిచిన సిబ్బందికి ధన్యవాదాలు చెప్పారు. సెమీఫైనల్లో విజయం బౌలర్ల వల్లే దక్కిందని.. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని చెప్పారు.అమిర్ స్థానంలో జట్టులోకి వచ్చిన రయీస్ తమ నమ్మాకన్ని నిలబెట్టాడని అన్నాడు. ఇండియాతో ఓటమి తర్వాత సెమీస్ చేరాలంటే ఆడే ప్రతి మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి నెలకోన్న నేపథ్యంలో తమ జట్టు సభ్యులతో తాను ఒక్కటే చెప్పానని అన్నాడు.
ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా అడాలని చెప్పానని, అయితే అందుకు టీమ్ మేనేజ్ మెంట్ కూడా పూర్తిగా సహకరించి తమ జట్టు సభ్యులపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని అన్నాడు. అందువల్లే తాము ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ కు చేరుకోగలిగామని సర్ఫరాజ్ తెలిపాడు. అనంతరం భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి స్పందిస్తూ.. ఇరు జట్లు అద్భుతంగా ఆడతాయి. ఫైనల్లో ఎవర్ని ఎదుర్కోవడానికైనా తాము సిద్ధంగా ఉన్నాంమని అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more