social media wishes Birthday boy MS Dhoni మిస్టర్ హెలికాప్టర్ కు శుభాకాంక్షల వెల్లువ

Social media wishes birthday boy ms dhoni on his birthday

Happy birthday dhoni, mahendra singh dhoni, MS Dhoni, virat kohli, twitterites, netgens, Mr, Helicopter, team india, yuvraj singh, hardik pandya, ICC, BCCI, csk, chennai super kings, cricket news, sports news, sports, cricket

Mahendra Singh Dhoni has been as popular and loved by people all over India. He is the only international captain to have won the ICC World Cup, the ICC WT20 and the ICC Champions Trophy.

మిస్టర్ హెలికాప్టర్ కు శుభాకాంక్షల వెల్లువ

Posted: 07/07/2017 06:05 PM IST
Social media wishes birthday boy ms dhoni on his birthday

భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీపై నెట్ జనులు శుభాకాంక్షలను వెదజల్లుతున్నారు. వెస్టిండీస్ పర్యటనలో వున్న ధోని ఇవాళ డబుల్‌ ధమాకా సంబరాలు జరుపుకొంటున్నాడు. విండీస్‌పై ఐదు వన్డేల సిరీస్‌ని 3-1 తేడాతో గెలుచుకున్న కోహ్లీ సేనలో సభ్యుడు ధోనీ. సిరీస్‌ సొంతం చేసుకున్న ఆనందంలో జట్టు సభ్యులతో కలసి మునిగితేలుతున్నాడు. ఇక దీనికి తోడు ఈ రోజు ధోనీ 36వ పుట్టిన రోజు కూడా తోడవ్వడంతో ఆటగాళ్లు పూర్తిగా సంబరాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు ధోనీతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

* ‘మిస్టర్‌ హెలికాప్టర్‌ ధోనీ మరిన్ని పుట్టిన రోజుల జరుపుకోవాలని కోరుకుంటున్నా. గ్రేట్‌ డే బడ్డీ. నీ కోసం కేకు ఎదురుచూస్తోంది’: యువరాజ్‌ సింగ్‌

* ‘భారత అభిమానులకు మధురానుభూతులను అందించిన వారి ఆనందానికి కారణమైన ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. హెలికాప్టర్‌ షాట్లతో అదరగొడుతూ మన గుండెల్లో నిలవాలి’: వీరేంద్ర సెహ్వాగ్‌

* ‘దిగ్గజ ఆటగాడు ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నువ్వు సాధించిన విజయాలకు అభినందనలు. భవిష్యత్తుకు ఆల్‌ ద బెస్ట్‌’: మహ్మద్‌ కైఫ్‌

* ‘హ్యాపీ బర్తడే ధోనీ. గ్రేట్‌ డే. ఫ్యాబులస్‌ ఇయర్‌’ : వీవీఎస్‌ లక్ష్మణ్‌

* ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ధోనీ కోసం కేకు సిద్ధం చేశాం’: హార్దిక్‌ పాండ్య

* ‘ హ్యాపీ బర్తడే ధోనీ. సిక్సర్‌తో 2011 ప్రపంచ కప్‌ను భారత్‌కు అందించాడు’: ఐసీసీ

* ‘ హ్యాపీ బర్తడే ధోనీ’: బీసీసీఐ

* ధోనీ పుట్టిన రోజును ‘ప్రపంచ హెలికాప్టర్‌ డే’గా పేర్కొన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతనికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.

భారత జట్టుకు ధోనీ అందించిన విజయాలను గుర్తు చేస్తూ బీసీసీఐ ఒక వీడియోను ప్రత్యేకంగా రూపొందించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Happy birthday  mahendra singh dhoni  MS Dhoni  virat kohli  cricket  

Other Articles