బీసీసీఐలో అమలు చేస్తున్న సంస్కరణల్లో భాగంగా ఆటగాళ్ల సంఘాన్ని ఏర్పాటు చేయాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కమిటీ నియమించిన లోథా కమిటీ సిఫార్సు చేసిన నేపథ్యంలో దానిని అమలు చేసేందుకు ఏర్పాటవుతున్న కమిటీలో కపిల్ దేవ్ కు కీలక బాధ్యతలు అప్పగించారా..? అంటే అవునన్న సంకేతాలు వెలువుడుతున్నాయి. లోధా కమిటీ సిఫార్సులను అమల్లోకి తెచ్చేందుకు నలుగురు సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ కమిటీలో ఇకపై కపిల్ దేవ్ కు కీలక బాద్యతలు అందనున్నాయన్న సమాచారం.
ఈ నేపథ్యంలో పరిపాలకుల కమిటీ (సీఓఏ) సుప్రీం కోర్టుకు సమర్పించిన తన నివేదికలో నలుగురు సభ్యుల స్టీరింగ్ కమిటీకి మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ పేరును సిఫార్సు చేసినట్లు తెలుస్తుంది. ఆయనతో పాటు మాజీ టెస్టు ఓపెనర్ అన్షుమన్ గైక్వాడ్, మాజీ క్రికెటర్ భరత్ రెడ్డి, జీకై పిళ్లై పేర్లను ఈ కమిటీ సభ్యులుగా సూచించింది. ఇటీవల ట్విటర్లో కపిల్‌దేవ్ తాను క్రికెటర్ల సంఘంలో భాగం కాబోతున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
కాగా, కపిల్ ప్రస్తుతం వ్యాఖ్యాతగా, కాలమిస్టుగా, పలు టీవీ ఛానల్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో ఆయన తన బిజీ షెడ్యూల్లో సమయం ఎలా కేటాయిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక అన్షుమన్ గైక్వాడ్ ప్రస్తుతం బరోడా క్రికెట్ అసోసియేషన్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడుకు చెందిన భరత్‌రెడ్డి 1979లో ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత జట్టులో కీపర్‌గా వ్యవహరించారు. మరోవైపు పరిపాలకుల కమిటీలో రామచంద్ర గుహ, విక్రమ్ లిమ్హే స్థానాలను భర్తీ చేయాలని కమిటీ తన నివేదికలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు విన్నవించింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more