ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా తన అద్భుత పోరాట పటిమను కొనసాగించి ఫైనల్స్ లోకి దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన సెమీ ఫైనల్స్ లో ఢిపెండింగ్ ఛాంపియన్స్ అస్ట్రేలియాపై ఘన విజయాన్ని సాధించి ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఐసీసీ మెగా టోర్నీలో భారత మహిళల జట్టు అసీస్ పై 36 పరుగుల విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో రెండో పర్యాయం టీమిండియా మహిళల క్రికెట్ జట్లు వరల్డ్ కప్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫైనల్ భెర్త్ ను ఖాయం చేసుకోగా, ఆస్ట్రేలియాను మట్టికరిపించిన మిథాలీ సేన కూడా ఫైనల్ కు చేరుకుంది. ఇవాళ జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచులో భారత్ చిరస్మరణీయ విజయం అందుకుని అభిమానుల కలను నెరవేర్చింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న మిథాలీ సేన నిర్ణీత 42 ఓవర్లలో 281 పరుగులను సాధించింది. అదిలోనే రెండు కీలక వికెట్లను కొల్పోయిన తరుణంలో క్రీజులోకి వచ్చిన హర్మన్ ఫ్రీత్ కౌర్ తన అద్బుత బ్యాటింగ్ తో సోర్కుబోర్డును పరుగులెత్తించింది.
115 బంతుల్లో 20 బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 171 పరుగులతో అజేయంగా నిలిచింది. సెంచరీ పూర్తి చేసుకున్న తరువాత మెరుపు వేగంతో పరుగులను రాబట్టింది. దీంతో టీమిండియా నిర్థేశించిన 282 పరుగుల విజయలక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ 40.1 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ 3, జులన్ గోస్వామి, శికా పాండే చెరో రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కట్టడి చేశారు. మిడిలార్డర్లో విలానీ(75) మ్యాచ్ చివర్లో బ్లాక్ వెల్ (90) అద్బుతంగా రాణించి.. మ్యాచ్ పై గెలుపు ఎవరి వశం అవుతుందన్న ఉత్కంఠ రేపింది.
ఒక దశలో సహచర క్రికెటర్లు అవుటవుతున్నా.. బ్లాక్ వెల్ ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పరుగులను రాబట్టింది. అయినా మిథాలీ సేన సమిష్టిగా రాణించి అసీస్ ను కట్టడి చేసింది. 39వ ఓవర్లో దీప్తీ శర్మ వేసిన తొలి బంతికి బ్లాక్ వెల్ అవుటవ్వడంతో టీమిండియా శిబిరంలో సంతోషం వెల్లివిసిరింది. ఫలితంగా 36 పరుగుల తేడాతో టీమ్ండిడియా గెలుపొందింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 42 ఓవర్లకు కుదించారు. ఇక ఈ నెల 23న లార్డ్స్ లో జరగనున్న ఫైనల్స్ లో మిథాలీ సేన ఇంగ్లాండ్ తో తలపడనుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more