Kaur Aggressive Like Kohli, Bats Like Sehwag హర్మన్ ప్రీత్ దంచికోట్టుడు వెనుక స్రీకెట్ అతనేనా..!

Harmanpreet kaur aggressive like kohli bats like sehwag

ICC Women's World Cup 2017, India vs Australia, semi finals, india, australia, Harmanpreet kaur, Virendra sehwag, mithali Raj, Virat Kohli, deepti sharma, Sri lanka, India Women's Cricket Team, points table, women's world cup points table, cricket news, cricket, sports news, latest news

She bats like Virender Sehwag and is aggressive like Virat Kohli," said Hemjit Kaur to describe the cricketing ability of her sister Harmanpreet.

హర్మన్ ప్రీత్ దంచికోట్టుడు వెనుక స్రీకెట్ అతనేనా..!

Posted: 07/21/2017 09:54 PM IST
Harmanpreet kaur aggressive like kohli bats like sehwag

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో టీమిండియా మహిళల జట్టు ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన నేపథ్యంలో వీరోచిత ఇన్నింగ్స్ అడిన హర్మన్ ప్రీత్ కౌర్ పై క్రీడాకారులు, అభిమానులు, నెట్ జనుల నుంచి ప్రశంసలు వెల్లివిరుస్తున్నాయి. కేవలం 115 బంతులలో 20 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 171 పరుగులు సాధించి అజేయంగా నిలిచిన అమె అధ్బుత అటను అభిమానులు ప్రశంసిస్తున్నారు. అయితే ఇలాంటి వీరోచితమైన ఆటను అడి అసీస్ బౌలర్లను బెంబేలెత్తించడానికి కారణం మాత్రం టీమిండియా మాజీ క్రికెటరేనట.

నమ్మశక్యంగా లేకపోయినా ఇది ముమ్మాటికీ నిజమని అమె సోదరి మెమ్ జిత్ తెలిపారు. కౌర్ కు చిన్ననాటి నుంచి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను బ్యాటింగ్ ఐడల్ గా తీసుకునే అమె అతనిలా బ్యాటింగ్ చేసేందుకు చాలా కష్టపడిందని చెప్పారు. ఆమె ఆరాధ్య క్రికెటర్ సెహ్వాగేనని.. సెహ్వాగ్ ఆటను ఎక్కువగా ఆస్వాదించేదని చెప్పారు. తన ఆటలోనూ సెహ్వాగ్ షాట్లు కనిపించాలన్న తపన అమెలో అధికంగా వుండేదని చెప్పారు. ఇక హర్మన్ రోల్ మోడల్ విషయానికొస్తే అమెకు తమ నాన్న హర్మందర్ సింగ్ తొలి కోచ్ అని తెలిపారు.

కాగా కౌర్ అద్బుత అటను ప్రశంసిస్తూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘వాట్ ఏ ఇన్నింగ్స్ కౌర్‌.. బౌలర్ల ప్రదర్శన అద్భుతమని’ ట్వీట్ చేయగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అద్బుతమైన బ్యాటింగ్ కౌర్‌.. విజయం దిశగా పయనించండి అని ట్వీట్ చేశాడు. సింగిల్ హ్యాండ్ తో గెలిపించే మ్యాచులు చూసి చాల రోజులైందని సంజయ మంజ్రేకర్ కౌర్ ప్రదర్శనను కొనియాడాడు. ఇక ట్వీటర్ వీరుడు.. సెహ్వాగ్ కౌర్ జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌.. అద్భుతమైన హిట్టింగ్ అంటూ ట్వీట్ చేశాడు. కౌర్ రాక్ స్టార్ అని భారత్ హెడ్ కోచ్ రవిశాస్త్రీ.. ప్రశంసించగా.. మహిళల ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ అని కైఫ్ హర్మన్ ను కొనియాడాడు.
 
వీరితో పాటుగా జస్ప్రీత్ బుమ్రా, సురైశ్ రైనా, శిఖర్ ధావన్ లు కౌర్ సహా మిథాలీసేనను అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. ఇక అభిమానులు ఇటు కౌర్ తో పాటుగా టీమిండియా మహిళా క్రికెట్ జట్టుకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ తమ అభిమానాని చాటుకుంటున్నారు. ఇంగ్లండ్ తో జరిగే ఫైనల్ లో భారత మహిళలు విజయం సాధించి ప్రపంచ కప్ సాధిస్తారని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ తరుపున వన్డేల్లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాట్స్ ఉమెన్ గా కౌర్ నిలిచింది. తొలి స్థానంలో దీప్తిశర్మ(188 నాటౌట్‌) కొనసాగుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles