పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన వకార్ యూనిస్ పై ఆ దేశానికే చెందిన మరో క్రికెటర్ కమ్రాన్ అక్మాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ తిరోగమనంలో పయనించడానికి వకారే ప్రధాన కారణమంటూ అక్మాల్ ధ్వజమెత్తాడు. రెండుసార్లు పాకిస్తాన్ కోచ్ గా పని చేసిన వకార్ వల్ల తమ ఆటకు జరిగిన మేలు ఏమిలేకపోగా, సర్వనాశనం చేశాడంటూ అక్మల్ విమర్శలు గుప్పించాడు.
'వకార్ ఒక ఫెయిల్యూర్ కోచ్. అదే క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ నాశనం కావడానికి కూడా కారణమయ్యాడు. పాకిస్తాన్ క్రికెట్ ను మూడేళ్లు వెనక్కినెట్టాడు. అతనికి వేరే ఆటగాళ్లతో విభేదాల గురించి నాకైతే తెలీదు. అసలు పాకిస్తాన్ క్రికెట్ ను ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై వకార్ కు ఎప్పుడూ ప్రణాళికలు లేవు. 2015 వరల్డ్ కప్ లో యూనిస్ ఖాన్ ను ఓపెనింగ్ చేయమనడమే వకార్ వద్ద ప్రణాళికలు లేవనడానికి ఒక ఉదాహరణ.
మరొకవైపు ఆసియా కప్ కు సంబంధించి ఒక మ్యాచ్ లో ఉమర్ అక్మల్ సెంచరీ చేస్తే, ఆ తరువాత మ్యాచ్ లో అతన్ని బ్యాటింగ్ ఆర్డర్ ను మరింత కిందకి నెట్టాడు. ఎవరితో విభేదాల కారణంగా ఇలా చేసాడో నాకైతే తెలీదు...కానీ పాకిస్తాన్ క్రికెట్ ను మాత్రం వకార్ నాశనం చేశాడు. ఆటగాడిగా వకార్ గొప్పవాడు కావొచ్చు.. కోచ్ గా మాత్రం ఫెయిల్యూర్'అని కమ్రాన్ అక్మల్ విమర్శించాడు.పాకిస్తాన్ కోచ్ వకార్ యూనిస్ రెండుసార్లు పనిచేసిన సంగతి తెలిసిందే. 2010 నుంచి 2011 వరకూ, 2014 నుంచి 2016 వరకూ వకార్ కోచ్ గా పాక్ కు సేవలందించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more