2008లో ఐపిఎల్ ఛాంపియన్స్ గా అవతరించిన రాజస్థాన్ రాయల్స్.. ఫ్రాంచైజీ సహ యజమాని రాజ్‌కుంద్రా బెట్టింగ్ కార్యకలాపాల కారణంగా రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొని మళ్లీ బరిలోకి దిగనుంది. అయితే కొత్తగా మళ్లీ బరిలోకి దిగుతున్న రాయల్స్ పేరును మార్చుకునేందుకు సిద్దమైంది. రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత ఐపీఎల్-2018లో రీఎంట్రీ ఇవ్వనున్న రాయల్స్ పేరు మార్చుకుని రావాలని భావిస్తుంది. క్లీన్ ఇమేజ్‌తో పునరాగమనం చేయాలని భావిస్తున్న రాయల్స్ .. ఫ్రాంచైజీ పేరు మార్పు కోసం బీసీసీఐని సంప్రదించింది. టీమ్ మొత్తాన్ని ప్రక్షాళన చేసి.. జట్టు ప్రతిష్ఠను పెంచే వారిని నియమించుకునేందుకు రాయల్స్ కార్యాచరణ ఆరంభించిందని సమాచారం.
అంతేకాకుండా సొంతగడ్డ జైపూర్ నుంచి తరలిపోవడానికి కూడా ఫ్రాంచైజీ ప్రయత్నాలు చేస్తున్నదని తెలిసింది. ఐపీఎల్ ఆరంభ టైటిల్ ను సొంతం చేసుకున్న రాయల్స్ ఆ తరువాత అంతటి ప్రదర్శన ఇవ్వలేదు. ఐపీఎల్ మరో జట్టు కింగ్స్ లెవెన్ పంజాబ్ కూడా మొహాలీ నుంచి తరలిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నదనే వార్తలు వస్తున్నాయి. పంజాబ్ రాష్ట్ర సంఘం నుంచి తగిన సహకారం లేదని, స్థానిక సంస్థల నుంచి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయనే కారణంతో మరో చోటికి మార్చాలని బీసీసీఐని కోరిందని తెలిసింది. గతంలో కూడా కింగ్స్ లెవెన్ ఇలాంటి ప్రతిపాదనే చేసినా.. బోర్డు తోసిపుచ్చింది. ఒకవేళ బేస్ ను మార్చుకుంటే కొత్త వేదిక ప్రకారం టీమ్ పేరు కూడా మారే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more