never interested in coach job says sehwag భవిష్యత్తులో ఎప్పుడూ అలాంటి తప్పు చేయను.!

Missed out on team india coach job for lack of setting sehwag

anil kumble, coach anil kumble, virender sehwag, ravi shastri, india cricket coach, icc champions trophy, anil kumble, bcci, ICC Champions Trophy 2017, sachin tendulkar, sourav ganguly, tom moody, virat kohli, vvs laxman, india coach, india coach applicants, cricket news, sports news, Team India, cricket

Team India former dashing opener virender sehwag opens up on his head coach application, says he won't apply for that post again in his life time.

భవిష్యత్తులో ఎప్పుడూ అలాంటి తప్పు చేయను.!

Posted: 09/15/2017 08:29 PM IST
Missed out on team india coach job for lack of setting sehwag

టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఇటీవల చేసిన తప్పును మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటానని అన్నాడు. టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేయాలన్న ఆలోచన తన మది నుంచి పూర్తిగా తీసేశానని, ఇక తన జీవితకాలంలో ఎప్పడూ అలాంటి పనికి పూనుకునేది లేదని కుండబద్దలు కోట్టాడు. అసలు తనకు టీమిండియా జట్టకు ప్రధాన కోచ్ కావాలన్న అశ కానీ, అసక్తి కానీ లేదని.. తేల్చిచెప్పాడు.

అయితే బీసీసీఐ ఉన్నత వర్గాలు తనతో సంప్రందించి సాయం చేయాల్సిందిగా కోరిన తరువాతే తాను కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి వచ్చి సంప్రదింపులు జరిపిన ఏదైనా సాయం చేయాలని కోరిన నేపథ్యంలోనే తాను ఆ పదవికి దరఖాస్తు చేశానని చెప్పాడు. అయితే ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీ కూడా తనను దరఖాస్తు చేసుకోమని సలహా కూడా ఇచ్చాడని చెప్పాడు.

అదే సమయంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కామెంటేటర్ వున్న తాను.. అక్కడ కలిసిన రవిశాస్త్రినీ.. కోచ్ పదవికి దరఖాస్తు చేస్తున్నావా అని అడిగిన వెంటనే.. లేదని, చేసిన తప్పు మళ్లీ చేస్తానా అని ఆయన సమాధానమిచ్చాడని దీంతో తాను కోచ్ పోస్టుకు అప్లై చేశానని వీరూ చెప్పాడు. అయితే దీనికి వీరూ మాత్రం చాలా హర్ట్ అయినట్లు వున్నాడు. అందుకునే నిత్యం తన సెకెండ్ ఇన్నింగ్స్ తో అలరించే వీరూ.. కాసింత నెమ్మదించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virender sehwag  ravi shastri  india coach  virat kohli  team india  anil kumble  bcci  cricket  

Other Articles