Kohli invites Aamir for3rd T20 కోహ్లీ వినతితో వచ్చిన సీక్రెట్ సూపర్ స్టార్

Virat kohli invites aamir khan for the 3rd t20i at hyderbad

Virat Kohli, Aamir Khan, India vs Australia 3rd T20I, Aamir Khan interviews Virat Kohli, Zaira Wasim, secret superstar, virat kohli chat show, virat kohli and aamir khan, Hyderabad T20I, IND vs AUS, latest cricket news, cricket news, latest spoerts news, sports news, sports, cricket

Team India captain Virat Kohli invited popular bollywood hero Aamir Khan to the match after they shot an episode of a TV chat show together on October 2.

కోహ్లీ వినతితో వచ్చిన సీక్రెట్ సూపర్ స్టార్

Posted: 10/13/2017 07:02 PM IST
Virat kohli invites aamir khan for the 3rd t20i at hyderbad

ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న చివరి టీ20కి అనుకోని ఓ ప్రముఖ సెలబ్రిటీ అతిథిగా హాజరయ్యేందుకు నగరానికి చేరుకున్నాడు. స్టాండ్స్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఆ అతిథి మరెవరో కాదు.. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్. లాగాన్ చిత్రం ద్వారా అయనకు క్రికెట్ అటపై వున్న అభిమానం ఎంటో అందరికీ తెలిసిందే.. అయినా.. ముంబై కాకుండా హైదరాబాద్ ప్రాంతంలో జరుగుతున్న మ్యాచ్ కు ఆయన హాజరవ్వడం.. అభిమానులకు కొత్త ఊపును కల్పిస్తుంది.
 
దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ నెల 2న వీరిద్దరూ కలసి ఓ టీవీ చానెల్ లో స్పెషల్ ఎపిసోడ్ చేశారు. దీంతో అప్పటి వరకు ఒకరికితో మరోకరికి కేవలం పరిచయం మాత్రమే వుండగా, ఆ టీవీ షో వీరి మధ్య బంధాన్ని మరింత దృడంగా మారింది. టీమిండియా సారథి కోహ్లీతో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇంటర్వ్యూ తీసుకోగా.. ఆ షో అద్యంతం నవ్వులు పూయించడంతో వీరి మధ్య సన్నిహిత్యం పెరిందింది. ఈ సందర్భంగా హైదరాబాద్ టీ20 మ్యాచ్ కు హాజరుకావాల్సిందిగా ఆమిర్‌ను కోహ్లీ ప్రత్యేకంగా ఆహ్వానించాడు.
 
దీంతో షో రికార్డింగ్ కు ముందు ఆమిర్‌ ఖాన్ కు కోహ్లీ టీమిండియా జెర్సీ అందించగా, ఆమిర తన రాబోయే సినిమా ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ట్రైలర్ చూపించాడు. కోహ్లీ ఆహ్వానాన్ని మన్నించిన ఆమిర్ ఖాన్ నటి జైరా వాసిమ్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. కోహ్లీ వినతి మేరకు అప్పటికప్పుడే తన షెడ్యూలులో హైదరాబాద్ పర్యటనను చేర్చుకున్నారు అమీర్ ఖాన్. టీమిండియా క్రికెటర్లు బసచేసిన హోటల్‌లోనే వారి బస కూడా ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. కాగా హైదరాబాద్ కు వచ్చిన అమీర్ కామెంటేటర్లతో భేటీలో పాల్గోన్నారు. మరి టీమిండియాను అమిర్ స్టాండ్స్ నుంచి ఎలా ప్రోత్సహిస్తారో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Aamir Khan  India vs Australia  Zaira Wasim  Hyderabad T20I  IND vs AUS  cricket  

Other Articles