న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ గెలుచుకోవడంలో మాత్రం వాళ్లిద్దరి పాత్ర ప్రముఖంగా వుందని టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నారు. కాన్పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 147 పరుగులు చేసిన రోహిత్.. అయితే మ్యాచ్ తుదికంతా.. అత్యంత ఉత్కంఠగా మారిన క్రమంలో.. టీమిండియా గెలుపులో మాత్రం ఇద్దరి ప్రాతే అధికంగా వుందని రోహిత్ అన్నాడు. వారిద్దరే ప్రస్తుతం ప్రపంచ డెత్ ఓవర్ స్పెషలిస్టులుగా పేరొందిన భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బూమ్రాలుగా పేర్కొన్నాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత 337 పరుగుల విజయలక్ష్యాన్ని కివీస్ ముందు పెట్టినా.. ఏ మాత్రం తడముకోకుండా పోటాపోటీగా పరుగులు చేసిన కివీస్ లక్ష్య ఛేదనలో ఆద్యంతం ఆకట్టుకుంది. తుది ఓవర్ వరకు అత్యంత ఉత్కంఠకరంగా సాగిన పోరులో కివీస్ 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి నాలుగు ఓవర్లలో విజయానికి 35 పరుగుల దూరంలో నిలిచిన కివీస్ ను కట్టడి చేసి భారత్ కు విజయాన్ని అందించింది భువి, బూమ్రాలేనని అన్నాడు.
వీరిద్దరూ అత్యుత్తమ డెత్ బౌలర్లు అనడంలో ఎటువంటి సందేహం లేదని.. కివీస్ తో మూడో వన్డేలో మరోసారి దాన్ని వారు రుజువు చేసుకున్నారని అన్నాడు. ‘నాలుగు ఓవర్లలో 35 పరుగులు ఈ వికెట్ పై ఏమాత్రం కష్టం కాదు. మరొకవైపు న్యూజిలాండ్ కూడా మంచి దూకుడుగా ఆడుతుంది. ఆ తరుణంలో మ్యాచ్ ను బూమ్రా, భువనేశ్వర్ లు నిలబెట్టారు. కివీస్ ను కట్టడి చేసి మళ్లీ గేమ్ ను మావైపుకి తీసుకొచ్చారు' అని రోహిత్ శర్మ విశ్లేషించాడు. చివరి 4 ఓవర్లలో వీరిద్దరూ 28 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించడంతో భారత్ ఆరు పరుగుల తేడాతో మ్యాచ్ ను నిలబెట్టుకున్న విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more