Sunil Gavaskar backs MS Dhoni ధోని ఒక్కడే మీ టార్గెట్ ఎందుకయ్యాడు..?

Sunil gavaskar backs ms dhoni to continue playing in t20is

Cricket, T20, India v/s New Zealand, Ind vs NZL, New Zealand, Virat Kohli, virat kohli, new zealand, MS Dhoni, Sunil Gavaskar, VVS Laxman, Indian cricket team, Ajit Agarkar, verendra sehwag, sports news,sports, latest sports news, cricket news, cricket

legendary Indian batsman Sunil Gavaskar has backed the MS Dhoni to continue playing in T20Is. He said that Dhoni alone should not be blamed for the loss to New Zealand in the second T20

ధోని ఒక్కడే మీ టార్గెట్ ఎందుకయ్యాడు..?

Posted: 11/07/2017 06:52 PM IST
Sunil gavaskar backs ms dhoni to continue playing in t20is

భారత లిటిల్ మాస్టర్, దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వెటరన్ క్రికెటర్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ దోనికి అండగా నిలిచారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో భాగంగా ట్వంటీ 20 ఫార్మాట్ నుంచి ఎంఎస్ ధోని తప్పుకుని, యువ ఆటగాళ్లకు ఛాన్స్‌ ఇవ్వాలంటూ మాజీ క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, అజిత్‌ అగార్కర్‌ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ.. ప్రస్తుతం జట్టులో క్రికెటర్ల లోపాలను ఎత్తి చూపడం మాని, వారిని ప్రోత్సహించడం చేయాలని ఆయన హితువు పలికాడు.

30 ఏళ్లు పైబడిన క్రికెటర్ లో లోపాలు వెతకడం చాలా ఈజీ అని.. ఇదే ప్రస్తుతం ధోని విషయంలోనూ జరుగుతోందని అన్నాడు. లక్ష్మణ్‌, అగార్కర్‌ లు ధోని తప్పుకోవాలంటూ సూచించారు. అయితే అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన పనిలేదని వ్యాఖ్యానించిన ఆయన ఇలా ఎవరిపైనైనా రాళ్లు వేసేప్పుడు.. జట్టులోని వారు చెప్పినట్లుగా యంగ్ క్రికెటర్లు ఎవరైనా రాణించారా..? అన్న విషయాన్ని కూడా వారు పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు.

జట్టులో ఎవరుండాలి.. ఎవరు వద్దు అన్న అంశాలను టీమ్ కెప్టెన్‌, కోచ్‌, సెలక్టర్లు చూసుకుంటారని అందులో సీనయర్లు జోక్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ధోని ఏం చేస్తాడో, అతడి ప్లానింగ్‌ ఏంటో తెలుసుకునేందుకు కొంతకాలం వరకు ఎదురుచూద్దాం. 37 బంతుల్లో ధోని 49 పరుగులు చేశారని విమర్శిస్తున్న... సీనియర్లు... రెండు టీ20ల్లో కలిసి ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు. సాధారణ గూగ్లీకి పాండ్యా ఔటైనా అతడ్ని వదిలేసి.. 49 పరుగులు చేసిన ధోనినే టార్గెట్ చేయడం దురదృష్టకరమని లిటిల్ మాస్టర్ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles