Spinner breaks stump with a googly in BPL | స్పిన్ బౌలింగ్ లో వికెట్ విరిగింది.. ఎలాగో చూడండి

Bowler breaks stump with a googly in bpl

Rashid Khan, Bangladesh Premier League, Wicket Break, Rashid Khan BPL Wicket, Rashid Khan Wicket Break

Rashid Khan breaks stump with a googly in BPL. It's normal for a tearaway fast bowler to break the stumps, but for a spinner, it's indeed rare. Afghan spin wizard Rashid Khan did the unthinkable during a Bangladesh Premier League (BPL) match.

స్పిన్నర్ బౌలింగ్ లో వికెట్ విరిగింది

Posted: 11/17/2017 10:01 AM IST
Bowler breaks stump with a googly in bpl

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్) టోర్నీలో జరిగిన ఓ విషయం ఆసక్తిని రేపుతుంది. సాధారణంగా ఫాస్ట్ బౌలర్ విసిరే బంతులకు వికెట్లు చెల్లాచెదురు కావటం చూస్తుంటాం. కానీ, ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ వేసిన బంతి స్టంప్స్‌ ను ముక్కలు చేయడం క్రికెట్ లో ఆసక్తి రేపుతోంది.

చిట్టగాంగ్‌ వైకింగ్స్‌- కొమిల్లా విక్టోరియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ లో కొమిల్లా విక్టోరియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న రషీద్‌ ఖాన్‌ 16వ ఓవర్ వేశాడు. రషీద్ సంధించిన గుగ్లీని అర్థం చేసుకోవడంలో తడబడిన శ్రీలంక బ్యాట్స్ మన్ మునవీర లెగ్ వికెట్ వైపుగా బ్యాటును తిప్పాడు. దీంతో బంతి నేరుగా మిడ్ వికెట్ ను తాకింది.

 

రషీద్ వేసిన బంతి వేగానికి వికెట్ ముక్కలైపోయింది. కాగా, రషీద్ 2016 ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాదుకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles