పర్యాటక జట్టు శ్రీలంకతో కొల్ కతాలోని ఈడెన్ గార్డన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ నిరాశకు గురైంది. మ్యాచ్ అద్యంతం ప్రకృతి సహకారం టీమిండియాకు లభించలేదు. తొలి ఇన్నింగ్స్ లో మొదటి రెండు రోజులు లంకవైపే మొగ్గుచూపిన వరుణుడు.. టీమిండియా బ్యాట్స్ మెన్లు అటను అడ్డుకున్నాడు. అంతేకాదు అడపాదడపా అడిన అటలో ఏకంగా ఐదు వికెట్లను అర్పించేశాడు.
అలా కిందపడిన టీమిండియా ఆ తర్వాత పుంజుకుని, గెలుపు అంచుల వరకు వెళ్లిగా, ఒకింత అందోళనకు గురైన లంక జట్టును మళ్లీ ప్రకృతి కరుణించింది. సరైన వెలుతురు లేని కారణంగా మ్యాచ్ ను నిలిపేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. పేస్ బౌలర్లను ఎదుర్కొనేంత లైటింగ్ లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను ముగించారు. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 75 పరుగులు మాత్రమే చేసింది. మరో 19 ఓవర్లు వరకు మిగిలి ఉన్నాయి.
రెండో ఇన్నింగ్స్ లో భారత జట్టులో 104 పరుగులతో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ 79, ధావన్ 94 పరుగులతో స్కోరు బోర్డును కదిలించారు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో పుజారా 22, షమీ 12, జడేజా 9, భువనేశ్వర్ 8, అశ్విన్ 7, సాహా 5, రహానే 0 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లక్మల్ 4, గమాగే 2, పెరీరా 2, సనక, హెరాత్ లు చెరో వికెట్ తీశారు.
అనంతరం లక్ష్యసాధనకు దిగిన లంక బ్యాట్స్ మెన్లు భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడారు. కెప్టెన్ చండిమల్ 20, డిక్ వెల్లా 27, మ్యాథ్యూస్ 12 మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో సమరవిక్రమ డకౌట్, కరుణరత్నే 1, తిరిమన్నే 7, సనక 6 నాటౌట్, పెరీరా డకౌట్ , హెరాత్ 0 డకౌట్ అయ్యారు. భారత బౌలర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి లంక నడ్డి విరిచాడు భువనేశ్వర్ కుమార్. షమీ 2, ఉమేష్ యాదవ్ 1 వికెట్ల తీశారు. కాగా, రెండో టెస్టు నాగపూర్ లో నవంబర్ 24 నుంచి 28 వరకు జరగనుంది. భువికే మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more