పర్యాటక జట్టు శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో విజయతీరపు అంచుల వరకు చేరిన టీమిండియాకు వరుణుడు అడ్డుగా నిలవడంతో మూడు వికెట్ల దూరంలో గెలుపును చేజార్చుకున్న విరాట్ సేన నాగ్ పూర్ వేదికగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రారంభం కానున్న రెండో టెస్టులో రెట్టించిన ఉత్సాహంతో అడాలని భావిస్తుంది.
అయితే లంక పర్యటనలో టెస్టు సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన భారత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు సన్నధమైన లంక.. వరుణుడి మద్దతుతో ఓటమి అంచులకు చేరినా తప్పించుకోగలిగింది. రెండో టెస్టులో మాత్రం భారత్ కు అధిపత్యం అందిస్తే సిరీస్ చేజారినట్టేనని భావిస్తున్న లంక.. తొలి టెస్టు డ్రా కావడంతో మిగిలిన రెండు టెస్టులను తమ ఖాతాలో వేసుకునేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇక అటు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి నేతృత్వంలో క్రికెటర్లు నాగ్ పూర్ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నారు.
తొలి టెస్ట్ డ్రాగా ముగియడంతో విరాట్ సేన రెండో టెస్టులో శ్రీలంకపై పైచేయి సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. రెండో టెస్ట్ మ్యాచ్ లో భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్ ఆడడం లేదు. వీరి స్థానంలో ఎవరి ఎంపిక చేస్తారో వేచిచూడాలి మరి. అయితే భువి స్తానంలో మాత్రం తమిళనాడుకు చెందిన పేసర్ కు అవకాశం దక్కనుందన్న సమాచారం. కాగా, ధావన్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నవేచి చూడాల్సిందే.
బీసీసీఐపై కోహ్లీ మండిపాటు
విశ్రాంతి లేకుండా ఒకదాని వెనుక మరకటి అలా వరుస సిరీస్ లను నిర్వహించడంపై విరాట్ కోహ్లీ తీవ్ర అభ్యంతరం తెలిపాడు. ప్రస్తుతం జరుగుతోన్న శ్రీలంక భారత్ సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనున్న నేపథ్యంలో కోహ్లీ ఫైర్ అయ్యారు. అటపైనే తప్ప అటగాళ్ల అరోగ్యంపై బిసిసిఐ శ్రద్ద చూపడం లేదని మండిపడ్డారు. కేవలం రెండు రోజుల వ్యవధిలో మళ్లీ పయనం కావాలంటే తమను పరీక్షించినట్టేనని అన్నారు. మరో గత్యంతరం లేకనే తాము అడుతున్నామని కోహ్లీ అన్నాడు. తమకు ఒక నెల గడువు దొరికినట్టయితే, తాము సరిగ్గా దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నద్ధమై ఉండేవాళ్లమని చెప్పాడు. సిరీస్‌లు ఆడడంలో సరైన ప్లానింగ్ ఉండాలని వ్యాఖ్యానించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more