పర్యటక జట్టు శ్రీలంకతో నాగ్ పూర్ వేదికగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజున టీమిండియా బౌలర్లు అదిరిపోయే ఆరంభం చేశారు. ఇక్కడి పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని అంచనాల నేపథ్యంలో కేవలం నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో.. అందులోనూ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియా లంకపతనాన్ని స్వల్ప స్కోరుకే శాసించింది. ఫలితంగా చండిమల్ పేన తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకే చాపచుట్టేసింది.
కెప్టెన్ కోహ్లీ నిర్ణయానికి న్యాయం చేస్తూ అశ్విన్ (4/67), ఇషాంత్ (3/37), జడేజా (3/56) విజృంభించడంతో లంక విలవిల్లాడింది. మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇక్కడ మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ దినేష్ చాందిమల్ (122 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 57), దిముత్ కరుణరత్నె (147 బంతుల్లో 6 ఫోర్లతో 51) మాత్రమే అర్ధ సెంచరీలతో రాణించారు.
భారీ అంచనాలున్న ఏంజెలో మాథ్యూస్ (10), నిరోషన్ డిక్‌వెలా (24), లాహిరు తిరిమన్నె (9) తీవ్రంగా నిరాశపరిచారు. ఓ దశలో 160/4తో పటిష్ఠ స్థితిలో ఉన్న లంకను స్పిన్ ద్వయం అశ్విన్, జడేజా తిప్పేశారు. ఈ ఇద్దరి ధాటికి చాందిమల్ సేన 45 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. అశ్విన్, జడేజా కలిపి 7 వికెట్లు పడగొట్టారు. ఇషాంత్ కూడా 3 వికెట్లు నేలకూల్చాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోయి 11 పరుగులు చేసిం ది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (7) విఫలమయ్యాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ (2 బ్యాటిం గ్)తోపాటు చటేశ్వర్ పుజారా (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. కాగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోరుకి టీమిండియా ఇంకా 194 పరుగులు వెనకబడే ఉంది. చేతిలో తొమ్మిది వికెట్లున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more