భారత క్రికెటర్ శిఖర్ ధావన్ గ్రౌండ్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా ఉద్వేగంగా అడతాడు. అలానే కనిపిస్తాడు కూడా. ఇక తాను అర్థశతకమో లేక శతకాన్ని నమోదు చేస్తే తన చేతుల తొడకొట్టేస్తాయి.. అంతేకాదు మీసాన్నికూడా మేలాయిస్తాయి. అదిరా గబ్బర్ అంటే అంటూ చేసేస్తాయి. ఇలాంటి ధావన్ ఫీల్డింగ్ లో మాత్రం తొలి అటగాళ్లతో ఎంతో సరదగా కనిపిస్తాడు. దీంతో ఎందరెందరికో ఆయన అభిమాన క్రికెటర్ గా కూడా మారిపోయాడు.
అలాంటి ధావన్ ఓ అభిమానిపై ఆగ్రహం ప్రదర్శించాడు. సెల్ఫీ దిగాలని వచ్చిన అతన్ని తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. లంకతో మూడో టెస్టు కోసం టీమిండియా దిల్లీ చేరుకుంది. ఈ నేపథ్యంలో ధావన్ తాజాగా ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. అభిమాన క్రికెటర్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అంతటితో ఆగారా. ధావన్‌తో కరచాలనం చేయాలని, సెల్ఫీ దిగాలని ప్రయత్నించారు. ఓ అభిమాని సెల్ఫీ కోసం తీవ్రంగా ప్రయత్నించగా గబ్బర్ ఆగ్రహానికి గురయ్యాడు.
దీంతో ఆ అభిమానిని అక్కడి నుంచి వెళ్లిపొమ్మని తోసేశాడు. ఇదంతా అక్కడే ఉన్న వారు తమ ఫోన్లలో బంధించారు. సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. దీంతో ఇది కాస్త వైరల్‌గా మారింది. ఎప్పుడూ ఎంతో సరదాగా ఉండే గబ్బర్‌కు తన చేష్టలతో అభిమానే చిరాకు తప్పించాడని కొందరు క్రికెటర్‌కు మద్దతు పలికారు. భద్రతా సిబ్బందిని దాటి వచ్చి మరీ కోహ్లీ సెల్ఫీలు దిగుతుంటే ధావన్‌కు ఏమైంది అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more