భారత్-శ్రీలంక మధ్య పంజాబ్ లోని మొహాలీ వేదికగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేల్లో టీమిండియా ధర్మశాల ప్రతీకారాన్ని తీర్చుకుంది. పర్యాటక జట్టు శ్రీలంక ను 141 పరుగలు తేడాతో ఓడించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ నిర్ధేశించిన 393 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో లంక విఫలమైంది. లంక బ్యాటింగ్ లో అంజిలో మాథ్యూస్(111) ఒంటిరి పోరాటం చేసి శతకాన్ని నమోదు చేసినప్పటికీ.. మరో ఎండ్ నుంచి మిగితా ఆటగాళ్ల మద్దతు లభించలేదు. మిగతా బ్యాట్స్ మెన్లందరూ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరుకోడంతో శ్రీలంక 50 ఓవర్లలో.. 251 పరుగులు మాత్రమే చేయగలిగింది.
మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 392 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ 208 పరుగులు చేసి అంతర్జాతీయ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అతనికి కొత్తగా అరంగ్రేటం చేసిన శ్రీయాస్అయ్యార్ నుంచి చక్కని భాగస్వామ్యం లభించింది. ధర్మశాల మ్యాచ్ నుంచి అరంగ్రేటం చేసిన అయ్యార్ రెండో వన్డేలో అర్థశతకాన్ని నమోదు చేసి.. 88 పరుగుల వద్ద ఔటయ్యాడు. అంతకుముందు ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా అద్బుతమైన అర్థశతకాన్ని నమోదు చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఆ భారీ టార్గెట్‌ని చేరుకోవడంతో విఫలమైంది.
62 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన లంక జట్టు ఆ తర్వాత కొద్దిపాటి పరుగల తేడాతోనే వికెట్లు కోల్పోవడం ప్రారంభించింది. మ్యాథ్యూస్ మినహా కీలక ఆటగాళ్లు పెరీరా(5), తరంగా(7), గుణతిలకా(16) స్వల్ప పరుగులకే పెవీలియన్ బాటపట్టారు. మిడిలాడర్ ఆటగాళ్లు డిక్వెల్(22), గుణరత్నే(34) భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి వెనుదిరిగారు. దీంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని భారత్ 1-1 తేడాతో సమం చేసింది. కాగా భారత్ బౌలింగ్‌లో చహాల్ 3, బుమ్రా 2, భువనేశ్వర్, పాండ్య, సుందర్ తలో వికెట్ తీశారు. మ్యాచ్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more