వన్డేలో మూడు పర్యాయాలు డబుల్ సెంచరీని సాధించి.. ఇక పోట్టి ఫార్మెట్ క్రికెట్ గా ఖ్యాతికెక్కిన టీ20లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీని సాధించడం.. వీటికి తోడు తాత్కాలిక కెప్టెన్నీ పగ్గాలను కూడా సక్రమంగా నిర్వర్తించిన ఇండియన్ ఓపెనర్ రోహిత్ శర్మకు దేశ, విదేశీ క్రికెట్ అభిమానులు, క్రికెటర్ల నుంచి అభినందనలు వెల్లివిరుస్తూనే వున్నాయి. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్.. కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే ఓపెనర్ రోహిత్ శర్మనే బెస్ట్ బ్యాట్స్‌మెన్ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కోహ్లి అభిమానులు ఈ మాటని ఒప్పుకున్నా లేక ఓప్పుకోకపోయినా ఇది మాత్రం వాస్తవమని ఆయన పునరుద్ఘాటించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన సందీప్ పాటిల్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లి కంటే రోహిత్ శర్మనే మెరుగైన బ్యాట్స్ మెన్ అన్నారు. అయితే విరాట్ కోహ్లి కూడా అత్యంత ప్రతిభ కలిగిన గొప్ప క్రికెటర్ అని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నాడు. అయితే.. అతను భారత్ జట్టు అత్యుత్తమ టెస్టు బ్యాట్స్ మెన్ అని అభిప్రాయపడ్డాడు.
పరిమిత ఓవర్ల క్రికెట్ లో కోహ్లి కంటే రోహిత్ శర్మ కొంచెం ముందు ఉన్నాడని పాటిల్ వివరించారు. వన్డే, టీ20 జట్టులో మెరుగ్గా రాణిస్తున్న రోహిత్ శర్మ.. ఇటీవలే టెస్టు జట్టులోనూ సుస్థిర స్థానం సంపాదించుకుని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. రోహిత్ వేగవంతమైన షాట్ సెలక్షన్ వన్డే, టీ20లకి బాగా నప్పుతుందన్నారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా డబుల్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ.. టీ20లో మెరుపు శతకం సాధించిన విషయం తెలిసిందే. అతని జోరుతో భారత్ జట్టు శ్రీలంకపై 2-1తో వన్డే సిరీస్‌ని.. 3-0తో టీ20 సిరీస్‌ని చేజిక్కించుకుంది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more