Yusuf Pathan thanks BCCI for fair trial ఐపీఎల్ కు అందుబాటులోకి యూసప్ పఠాన్

Bcci suspends yusuf pathan for five months on doping violation

Yusuf Pathan, doping, ban term, sports, all rounder, IPL, indian primier league, BCCI, Cricket, sports news, sports news, latest sports news, latest news

Former India allrounder Yusuf Pathan has been suspended by the Board of Control for India in Cricket (BCCI) for five months on the grounds of a doping violation.

ఐపిఎల్ కు అందుబాటులోకి యూసప్ పఠాన్

Posted: 01/09/2018 08:19 PM IST
Bcci suspends yusuf pathan for five months on doping violation

డోపింగ్ టెస్టులో పట్టుబడిన భారత క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఐపీఎల్ వేలం కాలానికి తన శిక్షాకాలం ముగించుకుని అందుబాటులోకి రానున్నాడు. నిషేధిత ఉత్ప్రేరకం ‘టెర్బుటలైన్‌’ వాడినట్లు తేలడంతో బీసీసీఐ అతనిపై ఐదు నెలల క్రితం అతనిపై ఐదు నెలల నిషేధాన్ని విధించగా, అది ఈ నెల 14తో ముగియనుంది. 2011 ప్రపంచకప్‌ సాధించిన భారత జట్టులో యూసుఫ్‌ సభ్యుడు. దేశవాళీ టీ20 టోర్నమెంట్‌లో భాగంగా గత ఏడాది మార్చి 16న డిల్లీలో యూసుఫ్‌ పఠాన్‌ నుంచి బీసీసీఐ యాంటీ డోపింగ్‌ సిబ్బంది శాంపిళ్లు స్వీకరించారు.

వీటికి పరీక్షలు నిర్వహించగా నిషేధిత ఉత్ప్రేరకం ‘టెర్బుటలైన్‌’ వాడినట్లు తేలింది. వాడా నిబంధనల ప్రకారం దేశవాళీ, అంతర్జాతీయ టోర్నీలు ఆడే క్రీడాకారులు దీన్ని వాడకూడదు. బీసీసీఐ యాంటీ డోపింగ్‌ నిబంధన ఆర్టికల్‌ 2.1 ఉల్లంఘన జరిగిందని పేర్కొన్న బీసీసీఐ తాత్కాలికంగా యూసుఫ్‌ పఠాన్‌పై ఐదు నెలల నిషేధం విధిస్తున్నట్లు అప్పట్లో ప్రకటన జారీ చేసింది. ఈ కారణంగానే అతడు గత ఏడాది ఐపీఎల్‌, రంజీ ట్రోఫీలో ఆడలేకపోయాడు.

అనంతరం విచారణకు హాజరైన యూసుఫ్‌ పఠాన్‌.. తాను ఈ మందును ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని, దగ్గు మందు ద్వారా అది తన శరీరంలోకి చేరిందని వివరణ ఇచ్చాడు. దీంతో పఠాన్‌పై నిషేధాన్ని పొడిగించాల్సిన అవసరం బీసీసీఐకు రాలేదు. త్వరలో తనపై విధించిన ఐదు నెలల నిషేధం ముగియడంతో యూసుఫ్‌ ట్విటర్‌ ద్వారా బీసీసీఐతో పాటు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. ఈ నెల చివరి వారంలో జరిగే ఐపీఎల్‌ వేలానికి యూసుఫ్‌ అందుబాటులో ఉండనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yusuf Pathan  doping  ban term  sports  all rounder  IPL  indian primier league  BCCI  Cricket  

Other Articles