కేప్ టౌన్ టెస్టులో విరాట్ సేన విఫలమై 72 పరుగులతో ఓటమిని చవిచూసిన తరువాత సెంచూరియన్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో మార్పులకు శ్రీకారం చుటుతుందని భావించినా ఈ టెస్టులోనే టెస్టు క్రికెట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు మొండి చెయ్యి ఇచ్చేందుకు జట్టు యాజమాన్యం సిద్దమైనట్లు సమాచారం. తొలి టెస్టులో చేజేతులా ఓటమిని చవిచూసి విజయావకాశాలను జారవిడిచిన కోహ్లీసేన.. సెంచూరియన్ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన పరిస్థితి కొని తెచ్చుకుంది.
సెంచూరియన్ పిచ్ అదనపు బౌన్స్, స్వింగ్ కు అనుకూలిస్తుందని విశ్లేషణతో కోహ్లీసేన నెట్స్‌లో కఠిన సాధన చేసింది. ఛెతేశ్వర్ పుజారా ఫస్ట్ స్లిప్ లో క్యాచ్‌లు సాధన చేయగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ నెట్స్ లో ముమ్మరంగా బ్యాటింగ్ చేశారు. కీలక అంశం ఏమిటంటే ఈ సెషన్ లో అజింక్య రహానె ఒక మూగ ప్రేక్షకుడిగా మాదిరిగా వారిద్దరి ఆటను వీక్షించాడు.
బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అతడికి కొన్ని బంతులు విసిరాడు. శిఖర్ ధావన్‌కు కూడా అంతే. ఐతే వీరిద్దరూ అసలైన పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోలేదు. దీనిని బట్టి రెండో మ్యాచ్‌లో వీరిద్దరూ ఆడే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. పేస్, స్వింగ్ బౌలింగ్‌లో బ్యాట్‌తో అటు అడ్డంగా.. ఇటు నిలువుగా షాట్లు ఆడే అజింక్యను కెప్టెన్ విరాట్ ఎందుకు పక్కనబెడుతున్నారన్న విషయం మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more