టీమిండియా పరుగుల యంత్రంగా ఖ్యాతికెక్కిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్ లో కోహ్లీ భారత క్రికెట్ జట్టు మాజీ సారథి సౌరభ్ గంగూలీ రికార్డును సమం చేశాడు. భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా గతంలో వ్యవహరించిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కెప్టెన్ గా నమోదు చేసిన 11 శతకాలను సమం చేశాడు.
అయితే కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ నుంచి పగ్గాలు అందుకున్న ఏ ఒక్కరూ ఇప్పటి వరకూ అయన సెంచరీల రికార్డులను అందుకోలేకపోయారు. తాజాగా కోహ్లీ డర్బన్ వేదికగా ఈ మైలురాయిని చేరుకుని ఆ రికార్డును సమం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ 112 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కోహ్లీ వన్డే కెరీర్లో ఇది 33వ శతకం కాగా కెప్టెన్‌గా 11వది కావడం విశేషం.
గంగూలీ 142 ఇన్నింగ్స్‌ల్లో 11 శతకాలు సాధించగా.. కోహ్లీ కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఘనతను అందుకున్నాడు. కాగా, డర్బన్ లో శతకాన్ని నమోదు చేయగానే విరాట్ కోహ్లీ తన బ్యాటును, హెల్మట్ ను మైదానంలో పెట్టి.. తాను గంగూలీ రికార్డుల్ని సమం చేశానన్న విషయాన్ని డ్రెసింగ్ రూమ్ వైపు సంకేతాలతో చూపుతూ చెప్పాడు. తన అగ్రసివ్ నెస్ గురించి మాట్లాడే విమర్శకులు.. అతని రికార్డులను కూడా పరిశీలించాలని విరాట్ కోహ్లీ చెప్పకనే చెప్పినట్లు వుందన్న వారు లేకపోలేరు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more