India wins ICC Under-19 Cricket World Cup | యువ భారత్.. కప్పు కైవసం

Under 19 wc 2018 won by india

Team India, Under 19 World Cup, Final Match, Manjot Kalra, Prithvi Shaw, Under 19 World Cup, Under 19 CWC, India vs Australiam Ishan Porel, Anukul Roy, Shiva Singh, Kamlesh Nagarkoti, Jonathan Merlo, Team india, Australia, Under-19 World Cup, New Zealand, Cricket

Manjot Kalra blasted a century as India defeated Australia by eight wickets to win the ICC Under-19 cricket World Cup title for a record fourth time. Get highlights of ICC Under-19 Cricket World Cup final as Prithvi Shaw’s side create history at the Bay Oval.

నాలుగోసారి: విశ్వవిజేతగా యువభారత్.. అసీస్ పై అలవోక విజయం.

Posted: 02/03/2018 03:29 PM IST
Under 19 wc 2018 won by india

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధ్వర్యంలో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌ లో యువభారత్ విశ్వవిజేతగా అవతరించింది. యావత్ భారతీయుల అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా భారత్ జట్టు రాణించి ప్రతిష్టాత్మక టైటిల్ ను నాలుగో పర్యాయం అందుకుంది. న్యూజీలాండ్ లోని టరంగా ప్రావిన్సులోని మౌంట్ మంగనుయ్ పట్టణం వేదికగా బే ఓవల్ మైదానంలో జరుగిన తుదిపోరులో అసీస్ జట్టును కంగారెత్తించిన టీమిండియా 8 వికెట్లతో ఘనవిజయాన్ని అందుకుంది.

భారత జట్టు కోచ్ గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ సానబెట్టిన సేన ప్రపంచ ప్రముఖ క్రికెటర్ల ప్రశంసలు అందుకునేలా అద్భుత ప్రతిభను కనబర్చింది. ఆస్ట్రేలియా జట్టు నిర్ధేశించిన 217 పరుగుల విజయలక్ష్యాన్ని అలవోకగా చేరకుంది. మరో పదకొండు ఓవర్లు మిగిలివుండగానే యువభారత జట్టు ఈ లక్ష్యాన్ని చేధించింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 38.5 ఓవర్లలో 220 పరుగులు సాధించిన యువభారత జట్టు సగర్వంగా వరల్డ్ కప్ ను తలకెత్తుకుంది.

ఆసీస్ ఆటగాళ్లు మెరుపు ఫీల్డింగ్ తో భారత యువజట్టు విజయాన్ని అడ్డుకునే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. యువభారత బ్యాట్స్ మెన్లు అద్బుతంగా రాణించడంతో విజయం వరించింది. అసీస్ అటగాళ్ల ప్రణాళికలను తిప్పికోడుతూ భారత యువ బ్యాట్స్ మన్ దూకుడుగా అడారు. మరీ ముఖ్యంగా మంజోత్ కల్రా అజేయ శతకం సాధించడంతో కంగారెత్తిన అసీస్.. ఓటమిని అంగీకరించక తప్పలేదు.

కెప్టెన్ పృథ్వీ షా (41 బంతుల్లో 29), ఈ వరల్డ్ కప్ టాప్ స్కోరర్ శుభ్ మన్ గిల్ (30 బంతుల్లో 31) భారీ స్కోర్లు సాధించనప్పటికీ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ మంజోత్ కల్రా (102 బంతుల్లో 101) దూకుడుగా ఆడి సత్తాచాటగా, కీపర్ దేశాయ్ (61 బంతుల్లో 47)లతో అజేయంగా నిలిచి స్థిరమైన ప్రదర్శనతో ప్రపంచ కప్ ను నాలుగో పర్యాయం అందుకుంది. దీంతో భారత ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది.  

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అసీస్ జట్టులో జోనథన్ మెర్లో అద్భుత ప్రదర్శనతో అర్థశతకాన్ని నమోదు చేసుకోగా, మిగిలిన క్రికెటర్లు ఎవరూ అంతగా రాణించలేదు. మిడిలాడర్ ఆటగాడు జొనథన్ మెర్లో(76) పరుగులతో అకట్టుకున్నాడు. దీంతో భారత బౌలర్లు ఆస్ట్రేలియా జట్టును కట్టడి చేయడంలో సఫలీకృతమయ్యారు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ నిర్ణీత ఓవర్లకు మరో రెండున్నర ఓవర్లు మిగిలివుండగానే కుప్పకూలింది.
 
మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. అయితే పెరోల్ దెబ్బకి ఇద్దరు ఓపెనర్లు, ఆ వెంటనే నాగర్‌కోటీ బౌలింగ్‌లో కెప్టెన్ సంగా పెవిలియన్ చేరారు. ఈ దశలో పరం ఉప్పల్‌తో కలిసి మెర్లో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కి 75 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేశారు. ఈ భారీ భాగస్వామ్యాన్ని ఉప్పల్ వికెట్‌తో అనుకుల్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఎవరూ క్రీజ్‌లో పెద్దగా నిలబడలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో అనుకుల్, నాగర్‌కోటీ, శివ, పెరొల్ చెరి రెండు, శివం మావి ఒక వికెట్ తీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : U-19 CWC 2019  Team india  Australia  Under-19 World Cup  New Zealand  Cricket  

Other Articles