ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. అందుకే ఈ ఏడాది ఐపీఎల్లో ఆడట్లేదు’ అని చెప్పాడు ఆస్ట్రేలియా బౌలర్ కేన్ రిచర్డ్సన్. 2013లో పుణె వారియర్స్ రూ.4.5కోట్లు వెచ్చించి రిచర్డ్సన్ను కైవసం చేసుకుంది. అనంతరం రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి రిచర్డ్సన్ ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 14 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన అతడు 24.61 సగటుతో 18 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
తాజాగా రిచర్డ్సన్ మాట్లాడుతూ..‘నేను ఈ ఏడాది ఐపీఎల్ వేలంలోకి రాకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పెళ్లి. రెండోది ఆసీస్ టెస్టు జట్టులో స్థానం దక్కించుకోవడం. ఇప్పుడు నా వయసు 26ఏళ్లు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత టెస్టు జట్టులో స్థానం కోసం షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడాలనుకుంటున్నాను.
ఈ టోర్నీలో ప్రతిభ ఆధారంగానే జట్టు ఎంపిక జరుగుతోంది. అందుకే ఈ ఏడాది ఐపీఎల్ కోసం నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో నా పేరు చేర్చలేదు. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని రిచర్డ్సన్ తెలిపాడు. ఇప్పటి వరకు రిచర్డ్సన్ ఆసీస్ తరఫున 15 వన్డేలు, 5 టీ20లు మాత్రమే ఆడాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more