అఫ్గానిస్తాన్ క్రికెట్ జట్టు ఆటగాడు రషీద్ ఖాన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేలో అత్యంత చిన్న వయస్కు కెప్టెన్ గా రికార్డు సాధించాడు. ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా ఆదివారం స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఈ ఘనత సాధించాడు.
ఒక జాతీయ క్రికెట్ జట్టుకు అత్యంత పిన్న వయసులో నాయకత్వం వహించి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. కెప్టెన్ అఫ్జఘర్ అపెండిసైటిస్ జరగటంతో మ్యాచ్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అందుకే ఆ స్థానంలో రషీద్ ను తీసుకున్నారు. 19 ఏళ్ల 165 రోజుల వయసులో రషీద్ ఖాన్ అఫ్గానిస్తాన్‌కు సారథిగా వ్యవహరించాడు. అంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ ఆటగాడు రజిన్ సలేహ్ పేరిట ఉండేది. 20 ఏళ్ల 297 రోజుల వయసులో బంగ్లాదేశ్‌కు రజిన్ నాయకత్వం వహించాడు. కాగా, ఆ రికార్డును రషీద్ ఖాన్ బద్ధలు కొట్టాడు.
ప్రస్తుతం రషీద్ ఖాన్ వన్డే, టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతుండటం మరో విశేషం. నిన్న జరిగిన మ్యాచ్‌లో రషీద్ నేతృత్వంలోని అప్ఘాన్ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో రషీద్ పేలవ ప్రదర్శన చేశాడు. బ్యాటింగ్‌లో ఎల్బీగా గోల్డెన్ డక్ అయిన రషీద్.. 9 ఓవర్లు బౌలింగ్ చేసిన 68 పరుగులిచ్చి ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more