టీమిండియా బౌలర్ మహమ్మద్ షమిపై ఎట్టకేలకు పోలీసులు పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయన భార్య హసీన్ జహాన్ అతనిపై సంధించిన తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో గత కొంతకాలంగా ఢిపెన్స్ లో పడిన షమీ.. మీడియాకు కూడా అందకుండా పోతున్న విషయం తెలిసిందే. తన భర్త షమీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు వేధింపులకు గురి చేశారని, తన భర్తకు ఇతర మహిళలతో వివాహేతర సంబంధం ఉందని అరోపణలు చేసిన ఆమె ఎట్టకేలకు ఈ విషయమై పోలీసులకు కూడా పిర్యాదు చేసింది. దీంతో పోలీసులు షమీ సహా అతని కుటుంబసభ్యులపై పలు క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అంతకుముందే మీడియా ద్వారా తన అవేదనను వెళ్లగక్కిన జహాన్.. షమిని కోర్టు మెట్లు ఎక్కిస్తానని కూడా తేల్చిచెప్పింది. ఇక జహాన్ పిర్యాదును అందుకున్న పోలీసులు ఇవాళ షమితో పాటు మరో నలుగురిపై ఐపీసీ 498 ఏ, 323తో పాటు పలు సెక్షన్ల కేసులు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులకు ఆమె పలు ఆధారాలను కూడా సమర్పించినట్లు సమాచారం. తనను చంపేందుకు కూడా తమ మెట్టినింటివారు ప్లాన్లు వేశారని, షమి తనను కొట్టేవాడని ఆమె పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. కాగా పాకిస్థాన్ మహిళ నుంచి కూడా షమీ డబ్బులు అందుకున్నాడని.. షమీ దేశద్రోహానికి కూడా పాల్పడివుండవచ్చని అనుమానాలను సైతం వ్యక్తం చేసింది.
అయితే తన భార్య హసీన్ జహాన్ అరోపణల నేపథ్యంలో పేసర్ షమీ స్పందించాడు. పాకిస్థాన్ మహిళ నుంచి డబ్బులు స్వీకరించానన్న తన భార్య ఆరోపణలను ఖండించాడు. తాను ఎలాంటి ఫిక్సింగ్ కు పాల్పడలేదని, ఎవరి నుంచీ డబ్బులు తీసుకోలేదని అన్నాడు. ఇంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న తన భార్య మానసిక స్థితిపై అనుమానం వ్యక్తం చేశాడు. తనపై ఆమె చేసిన ఫిక్సింగ్ ఆరోపణలు దారుణమని, వాటిని ఆమె నిరూపించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. దీనిపై సరైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాడు. తాను తన భార్యతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ కుదరడం లేదని, ఆమె చుట్టూ ఉన్నవాళ్లు చేసిన కుట్ర ఇదని, ఇంత తీవ్రమైన అభియోగాలు ఇప్పుడే ఎందుకు మోపుతోందో తనకు అర్థం కావడం లేదని షమీ పేర్కొన్నాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more