టీమిండియా వైస్ కెప్టెన్, ఇక త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ కూడా అయిన రోహిత్ శర్మ చాలా సంతోషంగా వున్నాడు. ఇటీవల జరిగిన ముక్కోణపు సిరీస్ ను తన నేతృత్వంలో అందుకున్న నేపథ్యంలోనో లేక త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ నేపథ్యంలోనే తనలోని డ్యాన్సింగ్ కళలను విభిన్నంగా చాటుకున్నాడు. ఆయన డ్యాన్స్‌కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోహిత్ అచ్చు ఏలియన్లా డ్యాన్స్ చేశాడు.
రోహిత్ శర్మ తన ఇన్స్టాగ్రాం ఖాతా ద్వారా ఓ వీడియోను పంచుకున్నాడు. అందులో ఒక వైపు ఏలియన్ ఎలా డ్యాన్స్ చేస్తుందో అచ్చు అలాగే రోహిత్ కూడా చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. ‘రోహిత్ చాలా బాగా డ్యాన్స్ చేశాడు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరో 5 రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌కు రోహిత్ సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ముంబయిలోని వాంఖడే మైదానంలో ప్రాక్టీస్ సెషన్లలో రోహిత్ పాల్గొంటున్నాడు.
ఈ ఏడాది కూడా విజేతగా నిలవాలన్న పట్టుదలతో ముంబయి ఇండియన్స్ అడుగులేస్తోంది. ఏప్రిల్ 7న ఐపీఎల్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో గత ఏడాది విజేతగా నిలిచిన ముంబయి ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఐపీఎల్ ప్రారంభ వేడుకలకు రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ మాత్రమే హజరవుతున్నారు. పలు కారణాల వల్ల ఇతర జట్ల కెప్టెన్లు హాజరుకాలేరని ఐపీఎల్ నిర్వాహకులు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more