భారత సెలక్టర్లు కనీస సమాచారం ఇవ్వకుండానే తనపై వేటు వేశారని సీనియర్ ఓపెనర్ మురళీ విజయ్ చెప్పడాన్ని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తప్పుబట్టాడు. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా విఫలమైన మురళీ విజయ్‌పై వేటు వేసిన సెలక్టర్లు.. అతని స్థానంలో చివరి రెండు టెస్టులకి పృథ్వీ షాని ఎంపిక చేశారు. అయితే.. జట్టు నుంచి తనని తప్పించే ముందు సెలక్టర్లు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని మురళీ విజయ్ నిన్న ఆవేదన వ్యక్తం చేశాడు.
అతనితో పాటు ఇటీవల కరుణ్ నాయర్, హర్భజన్ సింగ్ కూడా సెలక్టర్ల తీరుపై మండిపడిన విషయం తెలిసిందే. మురళీ విజయ్ వ్యాఖ్యలపై తాజాగా భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పందించారు. ‘జట్టు నుంచి మురళీ విజయ్‌ని తప్పించేటప్పుడు అతనికి సమాచారం ఇవ్వలేదనే మాట అవాస్తవం. జట్టు ఎంపిక సమయంలో నా సహచర సెలక్టర్ దేవాంగ్ గాంధీ ఓపెనర్ మురళీ విజయ్‌తో మాట్లాడాడు. అతడ్ని ఎందుకు జట్టు నుంచి తప్పిస్తున్నామో కారణం కూడా సవివరంగా చెప్పాడు.
కానీ.. మురళీ విజయ్ తనకి సమాచారం ఇవ్వలేదని నిన్న చెప్పడం నన్ను ఆశ్చర్యపరిచింది’ అని ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చారు. ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టుల్లో ఆడిన మురళీ విజయ్ నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి చేసిన పరుగులు 26 మాత్రమే. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ అతను డకౌటయ్యాడు. దీంతో.. మూడో టెస్టులో అతనిపై వేటు పడగా.. చివరి రెండు టెస్టుల్లో కనీసం జట్టులోకి కూడా సెలక్టర్లు ఈ ఓపెనర్‌ని ఎంపిక చేయలేదు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more