ఆస్ట్రేలియా పర్యటన కోసం తానేమీ ప్రత్యేకంగా సిద్ధం కావట్లేదని భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో నవంబరు 21 నుంచి మూడు టీ20లు, నాలుగు టెస్టులతో పాటు మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని భారత్ జట్టు ఆడనుంది. ఈ పర్యటన కోసం ఇప్పటికే జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లకి వెస్టిండీస్‌తో సిరీస్ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత్ జట్టు.. ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది. దీంతో.. కనీసం ఆస్ట్రేలియా పర్యటనలోనైనా టెస్టు సిరీస్ గెలవాలని టీమిండియా ఆశిస్తోంది.ఆస్ట్రేలియా పిచ్‌లపై సత్తాచాటేందుకు ఏవైనా ప్రత్యేక వ్యూహాలతో వెళ్తున్నారా..? అని జస్ప్రీత్ బుమ్రాని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. ‘నేను ఆస్ట్రేలియాకి వెళ్లిన తర్వాత.. అక్కడి పిచ్‌ల గురించి అవగాహన తెచ్చుకుంటా.
అలా కాకుండా.. ఇక్కడి నుంచి ప్రత్యేక వ్యూహాలతో వెళితే.. అవి తారుమారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఫ్రెష్‌గా అక్కడి వెళ్లి.. పిచ్‌లకి అనుగుణంగా.. ప్లానింగ్ చేసుకుంటా’ అని బుమ్రా వెల్లడించాడు. భారత్ జట్టు వెస్టిండీస్‌తో ఈనెల 21 నుంచి ఐదు వన్డేల సిరీస్ ఆడనుండగా.. ఇప్పటికే తొలి రెండు వన్డేల కోసం సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. అయితే.. ఈ జట్టు నుంచి కూడా బుమ్రా, భువీకి వారు విశ్రాంతినిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more