చెన్నె వేదికగా జరిగిన టీ20 చివరి మ్యాచ్ లో టీమిండియా జట్టు రసవత్తరమై పోరులో విజయం సాధించిన తరువాత భారత వికెట్ కీపర్, యువ హిట్టర్ రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడని ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసించాడు. 182 పరుగుల లక్ష్యాన్ని శిఖర్ ధావన్ (92: 62 బంతుల్లో 10x4, 2x6), రిషబ్ పంత్ (58: 38 బంతుల్లో 5x4, 3x6) దూకుడుగా ఆడటంతో భారత్ జట్టు ఆఖరి బంతికి ఛేదించిన విషయం తెలిసిందే.
చేజింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ (4), కేఎల్ రాహుల్ (17) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోయినా.. ధావన్-పంత్ జోడి మూడో వికెట్‌కి అభేద్యంగా 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియా విజయం ఖాయమైంది. మ్యాచ్ అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ ‘రిషబ్ పంత్ చాలా చక్కగా ఆడాడు. స్పిన్నర్లు, పేసర్లని సమర్థంగా ఎదుర్కొన్న పంత్ కొన్ని చూడచక్కని సిక్సర్లు కూడా బాదాడు అని కితాబిచ్చాడు.
ఇక ఈ మ్యాచుతో పాటు సిరీస్ లో నేను కూడా మంచి స్కోరు సాధించగలిగాను. ఛేదన ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు చేజారడంతో.. సీనియర్ బ్యాట్స్‌మెన్‌గా ఆఖరి వరకూ నేను క్రీజులో ఉండాలని నాకు తెలుసు. పంత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని బాగా ఆస్వాదించా. ఐదు వన్డేల సిరీస్‌లో 154 పరుగులే చేయడంతో నాపై విమర్శలు గుప్పించారు. కానీ.. వాటిని నేను పట్టించుకోలేదు. మళ్లీ ఫామ్ అందుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని శిఖర్ ధావన్ వెల్లడించాడు.
FIFTY!@RishabPant777 joins the party and brings up his 1st T20I half-century.#TeamIndia 152/2 after 16 overs, need 29 more runs to win this game #INDvWI pic.twitter.com/xhRAt7Rbw6
— BCCI (@BCCI) November 11, 2018
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more