ఆస్ట్రేలియా గడ్డపై స్పిన్నర్ లేకుండానే టీమిండియా తుది జట్టుని ఎంచుకోవడంపై భారత మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే మండిపడ్డాడు. గత వారం పెర్త్ వేదికగా ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో.. పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉండటంతో భారత్ జట్టు నలుగురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది. కానీ.. రెండో రోజుకే బ్యాట్స్ మెన్ పాదముద్రల కారణంగా పిచ్ గరుకుగా మారిపోయి స్పిన్నర్లకి అతిగా సహకరించడం మొదలెట్టింది.
దీంతో.. వికెట్ల పండగ చేసుకున్న ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. దీంతో.. స్పిన్నర్ లేకుండా తుది జట్టుని ఎంచుకుని టీమిండియా పొరపాటు చేసినట్లు స్వయంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్బోర్న్ వేదికగా బుధవారం నుంచి మూడో టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో మీడియాతో తాజాగా మాట్లాడిన అనిల్ కుంబ్లే.. టీమిండియా మేనేజ్మెంట్కి కూడా మొట్టికాయలు వేశాడు.
‘నేను టీమిండియాకి ఆడుతున్న రోజుల్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ టెస్టుల్లో బ్యాట్స్‌మెన్‌గా పరుగులు చేయడమే కాకుండా.. స్పిన్ బౌలింగ్‌తోనూ ఆకట్టుకునేవారు. ముఖ్యంగా.. సచిన్ అయితే.. అప్పుడప్పుడు ప్రొఫెషనల్ స్పిన్నర్ తరహాలో వికెట్లు కూడా పడగొట్టేవాడు. కానీ.. పెర్త్ టెస్టులో టీమ్‌ని చూస్తే.. హనుమ విహారి తప్ప స్పిన్ బౌలింగ్ వేయగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాడు నాకు కనిపించలేదు. అతను కూడా పార్ట్ టైమ్ స్పిన్నర్. అయినప్పటికీ.. విరాట్ కోహ్లీ తుది జట్టులో కనీసం ఒక ప్రొఫెషనల్ స్పిన్నర్‌కి కూడా చోటివ్వకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది’ అని అనిల్ కుంబ్లే వెల్లడించాడు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more