సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాల్గవ టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలిరోజు ఆటలో పూర్తి అదిపత్యాన్ని ప్రదర్శించింది. ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు నమోదు చేసింది. చతేశ్వర్ పుజారా(130 బ్యాటింగ్; 250 బంతుల్లో 16 ఫోర్లు), హనుమ విహారి(39 బ్యాటింగ్; 58 బంతుల్లో 5 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు.
ఇవాళ ఆరంభమైన చివరిదైన నాల్గవ టెస్టులో టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఇన్నింగ్స్‌ను మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్‌లు ప్రారంభించగా, ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి రాహుల్(9) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో చతేశ్వర్ పుజారాతో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు మయాంక్. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత మయాంక్ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్ గా పెవిలియన్ చేరాడు.
అనంతరం పుజారాతో కలిసి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టాడు. ఈ క్రమంలోనే పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే టీబ్రేక్ తర్వాత విరాట్ కోహ్లి(23) ఔట్ కావడంతో భారత్ 180 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన రహానే పుజారాతో కలిసి 48 పరుగుల్ని జత చేసిన 18 వ్యక్తిగత పరుగుల స్కోరు వద్ద పెవిలీయన్ చేరాడు.
తన అరంగ్రేట టెస్టులో విఫలమైన ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారితో పూజారాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చక్కగా అడుతూ క్రమం తప్పిన బంతులను బౌండరీలకు మలిచారు. ఆ క్రమంలోనే పుజారా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పుజారాకు టెస్టుల్లో 18వ సెంచరీ కాగా, ఈ సిరీస్‌లో మూడోది. ఆసీస్ బౌలర్లలో హాజిల్‌వుడ్ రెండు వికెట్లు సాధించగా, స్టార్క్, లయన్ లకు తలో వికెట్ దక్కింది.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more