ఆస్ట్రేలియాకి సొంతగడ్డపై టెస్టులో ఓటమి రుచిచూపిన భారత్ జట్టు.. వన్డే సిరీస్‌ని మాత్రం ఓటమితో ఆరంభించింది. సిడ్నీ వేదికగా శనివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ (133: 129 బంతుల్లో 10x4, 6x6) శతకం బాదినా.. టీమిండియాకి 34 పరుగుల తేడాతో కంగారూల చేతిలో ఓటమి తప్పలేదు. 289 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మతో పాటు మహేంద్రసింగ్ ధోని (51: 96 బంతుల్లో 3x4, 1x6) నిలకడగా ఆడినా.. కీలక సమయంలో వికెట్లు చేజార్చుకోవడంతో ఆఖరికి భారత్ 254/9కే పరిమితమైంది.
దీంతో.. మూడు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో వన్డే అడిలైడ్ వేదికగా మంగళవారం ఉదయం 8.50 నుంచి జరగనుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు.. హ్యాండ్స్‌కబ్ (73: 61 బంతుల్లో 6x4, 2x6), ఉస్మాన్ ఖవాజా (59: 81 బంతుల్లో 6x4), షాన్ మార్ష్ (54: 70 బంతుల్లో 4x4) అర్ధశతకాలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ (2/66), కుల్దీప్ యాదవ్ (2/54) ఫర్వాలేదనిపించారు.
289 పరుగుల లక్ష్యఛేదనలో భారత్‌కి మెరుగైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ శిఖర్ ధావన్ (0), కెప్టెన్ విరాట్ కోహ్లీ (3), అంబటి రాయుడు (0) తొలి నాలుగు ఓవర్లలోపే పెవిలియన్ చేరిపోవడంతో భారత్ 4/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ - మహేంద్రసింగ్ ధోని జోడీ.. నాలుగో వికెట్‌కి అభేద్యంగా 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకోవడంతో భారత్ ఒకానొక దశలో 140/3తో మెరుగైన స్థితిలో నిలిచింది.
కానీ.. జట్టు స్కోరు 141 వద్ద ధోనీ ఔటవగా.. అనంతరం వచ్చిన దినేశ్ కార్తీక్ (12), రవీంద్ర జడేజా (8) నిరాశపరిచారు. అయినప్పటికీ.. ఒక ఎండ్‌లో 46వ ఓవర్ వరకూ పోరాడిన రోహిత్ శర్మ.. కెరీర్లో 22వ శతకం పూర్తి చేసుకుని జట్టు స్కోరు 221 వద్ద ఔటయ్యాడు. దీంతో.. భారత్ ఓటమి ఖాయమైంది. అయితే.. ఆఖర్లో భువనేశ్వర్ కుమార్ (29 నాటౌట్: 23 బంతుల్లో 4x4) బ్యాట్ ఝళిపించి ఓటమి అంతరాన్ని కాస్త తగ్గించాడు.
భారత్ వన్డే జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్
ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్‌కబ్, మార్కస్ స్టాయినిస్, గ్లెన్ మాక్స్వెల్, బెరెండ్రాఫ్, పీటర్ సిడిల్, నాథన్ లయన్, రిచర్డ్సన్
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more