టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి మ్యాచ్ ఫినిషర్ గా మంచి పేరుంది. ఆయన దాదాపుగా అటు వన్డేల్లోనూ, ఇటు టీ20ల్లోనూ అనేక మ్యాచులను చివరి ఓబర్లలో ఉత్కంఠకర పోరులో గెలిపించిన క్రీకెటర్. అయినా గత కొంతకాలంగా పేలవమైన ప్రదర్శనతో అకట్టుకోలేకపోయిన ధోనిపై విమర్శలు వచ్చాయి. దీంతో తానెంటో.. తన సత్తా ఏంటో ఇటీవల అసీస్ గడ్డపైన, కివీస్ గడ్డపైనా చూపించాడు ధోని. దీంతో విమర్శలకు బ్రేకులు పడినా అది కొంతకాలానికి మాత్రమే పరిమితమయ్యింది. క్రితం రోజు తనకు అచ్చొచ్చిన విశాఖ వేదికలో పరుగులు చేయకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆస్ట్రేలియాతో తొలి టీ20లో పరుగులు చేయలేదని, భారీ షాట్లు ఆడలేదని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఆసీస్‌తో మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 7 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (50; 36 బంతుల్లో 6×4, 1×6) అర్ధశతకం సాధించాడు. కోహ్లీ, రాహుల్ ఉన్నంత వరకు పటిష్ఠ స్థితిలో ఉన్న టీమిండియా ఒక్కసారిగా 94/5తో ఒత్తిడిలోకి జారిపోయింది. రిషభ్ పంత్ నిష్ర్కమణతో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ అతడు 37 బంతుల్లో ఒక సిక్సర్ సాయంతో 29 పరుగులే చేశాడు.
ఆసీస్ బౌలింగ్ ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. భారీ షాట్లకు ప్రయత్నించలేదు. ఛేదనలో ఆసీస్ ఆఖరి బంతికి విజయం అందుకుంది. పరుగులు చేయకపోవడంతో ధోనీపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ‘తను మాత్రమే బ్యాటింగ్ చేస్తానని ధోనీ అనుకుంటున్నాడా? అవతలి వారికి స్ట్రైక్ ఇవ్వలేదు. ఆయనా పరుగులు చేయలేదు. ఇది మంచిది కాదు’, ‘పాత జ్ఞాపకాలు చెరిపేయకు. దయచేసి రిటైర్ అవ్వు’, ‘పరుగెత్తకుండా 10+ సింగిల్స్ తీయలేదు. అటు హిట్టింగూ చేయలేదు’, ‘ఎంఎస్ ధోనీ గెలుపు కోసం ఆడే వ్యక్తి. కొన్ని సార్లు భారత్ కోసం, మరికొన్ని సార్లు ప్రత్యర్థుల కోసం’ అంటూ ట్విటర్లో నెటిజన్లు వ్యంగ్య బాణాలు విసిరారు.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more