CSK captain MS Dhoni loses cool అంపైర్లపై మిస్టర్ కూల్ ఫైర్.. ఫీజులో కొత..

Dhoni faces flak for on field argument with umpires

Cricket,RR vs CSK,Rajasthan Royals,ms dhoni,Mahendra Singh Dhoni,ipl 2019,indian premier league,Chennai Super Kings,ben stokes cricket, cricket news, sports news, latest sports news, sports

Thursday’s match between Rajasthan Royals and Chennai Super Kings at Sawai Mansingh Stadium here will be better known for Captain Cool losing his cool than his team winning the contest.

అంపైర్లపై మిస్టర్ కూల్ ఫైర్.. ఫీజులో కొత..

Posted: 04/12/2019 09:31 PM IST
Dhoni faces flak for on field argument with umpires

రాజస్థాన్ రాయల్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాగ్వివాదానికి దిగిన చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి జరిమానా పడింది. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ధోనీపై మ్యాచ్ రిఫరీలు చర్యలు తీసుకున్నాడు. ధోనీ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు.
 
చివరి ఓవర్లో చెన్నై విజయానికి ఇంకా 18 పరుగులు అవసరం కాగా, స్టోక్స్ తొలి బంతిని ఆఫ్‌స్టంప్ ఆవలకు సంధించాడు. జడేజా ఈ బంతిని స్టాండ్స్‌లో పంపి ఆరు పరుగులు సాధించాడు. ఆ తర్వాతి బంతిని స్టోక్స్ నోబాల్ వేయగా జడేజా సింగ్ తీశాడు. ఇక ఫ్రీహిట్ ఆడిన ధోనీ రెండు పరుగులు మాత్రమే సాధించాడు. ఆ తర్వాతి బంతికి స్టోక్స్ అవుటయ్యాడు. దీంతో చివరి మూడు బంతుల్లో చెన్నై విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి.
 
నాలుగో బంతిని స్టోక్స్ శాంటర్న్ నడుముపైకి వేయడంతో అంపైర్ దానిని నోబాల్‌గా ప్రకటించాడు. అయితే, లెగ్ అంపైర్ మాత్రం అది నోబ్ కాదని చెప్పడంతో ప్రధాన అంపైర్ తన చేతిని కిందికి దించేశాడు. దీంతో ఏం జరుగుతోందో కాసేపు ఎవరికీ అర్థం కాలేదు. అంపైర్ల తీరుపై క్రీజులో ఉన్న జడేజా అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇది చూసిన ధోనీ డ్రెస్సింగ్ రూము నుంచి ఆగ్రహంగా మైదానంలోకి వచ్చి అంపైర్లతో వాగ్వివాదానికి దిగాడు. అయినప్పటికీ అంపైర్లు అది నోబ్ కానేకాదని తెగేసి చెప్పడంతో ధోనీ మైదానం వీడాడు.
 
ఆట జరుగుతుండగా మైదానంలోకి వచ్చి ఫీల్డ్ అంపైర్లతో ధోనీ గొడవకు దిగడాన్ని మ్యాచ్ రిఫరీ తీవ్రంగా పరిగణించాడు. ధోనీకి జరిమానా విధిస్తూ చర్యలు తీసుకున్నాడు. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించాడు. ఇక, స్టోక్స్ వేసిన ఆఖరి బంతిని సిక్సర్ కొట్టిన శాంట్నర్ జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MS Dhoni  RR vs CSK  Rajasthan Royals  ipl 2019  Chennai Super Kings  ben stokes  cricket  

Other Articles