క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికిచ్చే ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈరోజు నలుగురు క్రికెటర్ల పేర్లని సిఫారసు చేసింది. ఈ జాబితాలో టీమిండియా ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు మహిళల క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కి కూడా చోటు లభించింది. కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ ఏటా క్రీడాకారుల్ని ఈ అర్జున అవార్డుతో సత్కరిస్తుండగా.. 2018లో భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధానాకి ‘అర్జున’ పురస్కారం దక్కింది.
భారత్ జట్టులోకి 2016లో ఆరంగేట్రం చేసిన జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా టీమ్‌లో తనదైన ముద్ర వేశాడు. ఇక 2013లో అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రవేశించిన మహ్మద్ షమీ.. గత ఏడాది కాలంగా అత్యుత్తమ ప్రదర్శనతో జట్టు విజయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా.. ఇటీవల ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ జట్టు టెస్టు సిరీస్ గెలవడంలో షమీ పాత్ర కీలకం. ఈ ఇద్దరు బౌలర్లు మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా ప్రారంభంకానున్న ప్రపంచకప్‌లో భారత్ జట్టుకి ప్రధాన బలమని ఇప్పటికే మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
టీమిండియాలోకి 2009లో అరంగేట్రం చేసిన రవీంద్ర జడేజా.. తొలుత స్పిన్నర్‌గా ఆ తర్వాత పరిపూర్ణమైన ఆల్‌రౌండర్‌గా జట్టులో కొనసాగుతున్నాడు. అన్నిటికంటే మించి.. భారత అగ్రశ్రేణి ఫీల్డర్‌గా ఇప్పటికే ఎన్నోసార్లు ప్రశంసలు అందుకున్నాడు. ఇక గత కొంతకాలంగా భారత మహిళల క్రికెట్ జట్టులో నిలకడగా రాణిస్తున్న పూనమ్ యాదవ్.. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ టాప్-10 బౌలర్‌గా కొనసాగుతోంది. అర్జున అవార్డు రేసులో నిలిచిన బుమ్రా, షమీ, జడేజా.. ఇటీవల ప్రపంచకప్ జట్టులోకి కూడా ఎంపికవడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Sep 27 | టీమిండియా జట్టుకు వరుస సంతోషాలు సొంతం అవుతున్నాయి. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై టి20 సిరీస్‌ను గెల్చుకున్న టీమిండియాకు.. ఆ వెంటనే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) విడుదల చేసిన జట్టు ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా జట్టు... Read more
Sep 27 | ఇంగ్లండ్ పర్యటనలో అతిధ్య జట్టును వారి సోంతగడ్డపైనే ఓడించి సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా.. జోష్ కొరవడింది. అందుకు కారణం మూడవ మ్యాచులో షార్లట్ డీన్ రనౌట్ అసంబద్దమైనదని బౌలర్ దీప్తిశర్మ సహా... Read more
Sep 27 | ఇంగ్లండ్, భారత్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అప్పటికే 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ... Read more
Sep 22 | తెలుగువాళ్లు అన్నీరంగాల్లోనూ బాగా రాణిస్తున్నారు. విద్యా, వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలతో పాటు ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు ఎందెందు వెతికినా అందుగలడు తెలుగువాడు అన్నట్టుగా ఏ రంగంలో చూసినా తెలుగువారు తమ... Read more
Sep 17 | టీమిండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్ లోనూ తన సత్తా చాటిన ఈ క్రికెటర్.. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ జట్టుకు ఆడుతుండగా అతనికి పెను... Read more